Watch Video: రేషన్ బియ్యంలో కేంద్రం వాటాపై నిర్మలా సీతారామన్‌ ప్రశ్నలు.. చెప్పలేక పోయిన కామారెడ్డి కలెక్టర్‌..

|

Sep 02, 2022 | 11:38 AM

Minister Nirmala Sitharaman: కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అంటూ వివరాలు అడిగారు. కేంద్ర మంత్రి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్‌కు క్లాస్‌

Watch Video: రేషన్ బియ్యంలో కేంద్రం వాటాపై నిర్మలా సీతారామన్‌ ప్రశ్నలు.. చెప్పలేక పోయిన కామారెడ్డి కలెక్టర్‌..
Nirmala Sitharaman
Follow us on

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో రేషన్‌షాపును సందర్శించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌. పర్యటన సమయంలో వెంట ఉన్న కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అంటూ వివరాలు అడిగారు. కేంద్ర మంత్రి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్‌కు క్లాస్‌ పీకారు. అరగంట టైమ్‌ తీసుకొని చెప్పాలని అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి. అంతేకాదు రేషన్‌షాపులో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మలా సీతారామన్‌.

అయితే అంతకుముందు.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్మలాసీతారామన్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలతో బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది.  ఇరువర్గాల తోపులాట చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో రెండు పార్టీలవారిని పోలీసులు అడ్డుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం