Telangana Formation Day: రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సర్వం సిద్ధం.. రాజన్న సిరిసిల్లలో జెండా ఆవిష్కరించనున్న మంత్రి కేటీఆర్

Telangana Formation Day: రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు.  రాష్ట్ర అవతరణ దినోత్సవానికి రాజన్న సిరిసిల్లలో సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో

Telangana Formation Day: రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సర్వం సిద్ధం.. రాజన్న సిరిసిల్లలో జెండా ఆవిష్కరించనున్న మంత్రి కేటీఆర్
Telangana Formation Day Ktr

Updated on: Jun 02, 2021 | 7:23 AM

KTR Siricilla tour : తెలంగాణ రాష్ట్ర ఏడో ఆవిర్భావ వేడుకలకు ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో ఈ యేడు సాదాసీదాగా నిర్వహించాలని సర్కారు ఆదేశించగా, ఈ మేరకు యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు.  రాష్ట్ర అవతరణ దినోత్సవానికి రాజన్న సిరిసిల్లలో సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా సాదాసీదాగా వేడుకలు నిర్వహించనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ఉదయం 9.15 గంటలకు కలెక్టర్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పది గంటలకు ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను పరిశీలిస్తారు. అనంతరం 10.30 గంటలకు సర్దాపూర్‌లోని పోలీస్‌ బెటాలియన్‌, మార్కెట్‌ యార్డులను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌కు తిరుగు పయనంకానుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 ఇవి కూడా చదవండి: Land Resurvey: ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు.. గ్రామాల్లో పట్టా భూముల రీసర్వేకు శ్రీకారం

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట.. 60 ఏళ్లు వచ్చే వరకూ అర్హులే అంటూ హైకోర్టు తీర్పు