Minister KTR: ఆ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మౌలికసదుపాయలపరంగా హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అని మున్సిపల్ మంత్రి KTR కొనియాడారు. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి సొంతూళ్లకు పోయిన తన ఫ్రెండ్స్ ..
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మౌలికసదుపాయలపరంగా హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అని మున్సిపల్ మంత్రి కేటీఆర్(Minister KTR) కొనియాడారు. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి సొంతూళ్లకు పోయిన తన ఫ్రెండ్స్ ఈ విషయాలు చెప్పారని అన్నారు. ఆ రాష్ట్రంలో కరెంట్ లేదు. చీకట్లు, నీళ్లు లేవు. రోడ్లు ధ్వంసమయ్యాయి. తిరగడానికి లేదని .. చాలా నరకంలో ఉన్నట్టులగా ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ హైదరాబాద్ వచ్చేవరకు ప్రశాంతంగా ఉండలేకపోయామన్నారు. వాళ్లకు అక్కడికెళ్లిన తర్వాత అర్థమైంది తెలంగాణలో డెవలప్‌మెంట్ ఎలా ఉందో? బెంగళూరులో కంపెనీ యజమానులు కూడా అక్కడ ట్రాఫిక్‌పై మండిపడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్, తెలంగాణ ప్రశాంత రాష్ట్రం అంటూ వెల్లడించారు. పట్ణణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే దేశం వెనుకబడి పోతుందని అన్నారు.
హైదరాబాద్‌లో క్రెడాయ్ నిర్వహించిన సదస్సుల్లో కేటీఆర్ పాల్గొన్నారు. భారతదేశంలో 80 శాతం గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ దేశాన్ని నడిపిస్తున్న శక్తి మాత్రం నగరాలు, పట్టణాలే అని తెలిపారు. తెలంగాణలో బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉందని వివరించారు. పల్లె, పట్టణాల్లో సమానమైన ప్రగతితో ఒక వినూత్నమైన విధానం తెలంగాణలో ఉందని KTR తెలిపారు. పొరుగు రాష్ట్రంలో ఉండే కష్టాల గురించి తనకు మిత్రులు చెప్పిన విషయాన్ని క్రెడాయ్ సదస్సులో KTR ప్రస్తావించారు.
Live: Addressing the gathering at the 11th edition of @CredaiHyderabad Property Show https://t.co/L9yuJFxuLt
— KTR (@KTRTRS) April 29, 2022
తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: Health Tips: ఆహారం తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే..
Back Pain Remedies: వెన్నునొప్పికి దాల్చిన చెక్కతో ఉపశమనం.. ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనం..