Telangana: మూసీ, ఈసీ నదులపై 14 వంతెనలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ, ఈసీపై 545 కోట్ల రూపాయలతో.. 14 వంతెనలపై నిర్మిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఫ‌తుల్లగూడా – పీర్జాదీగూడ వంతెనకు ఆయన శంకుస్థాప‌న చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో సహా ప‌లువురు నేతలు, పార్టీ శ్రేణలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

Telangana: మూసీ, ఈసీ నదులపై 14 వంతెనలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Telangana Minister KTR

Updated on: Sep 25, 2023 | 9:53 PM

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ, ఈసీపై 545 కోట్ల రూపాయలతో.. 14 వంతెనలపై నిర్మిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఫ‌తుల్లగూడా – పీర్జాదీగూడ వంతెనకు ఆయన శంకుస్థాప‌న చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో సహా ప‌లువురు నేతలు, పార్టీ శ్రేణలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి గొప్ప పేరు, ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి న‌దిగా మూసీ న‌ది ఉండేద‌ని వ్యాఖ్యానించారు. కానీ గ‌త ప్రభుత్వాలు ఈ నదిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చివరికి మూసీ న‌ది మురికి కూపంగా మారిపోయిందని తెలిపారు. ప్రస్తుతం మూసీ నది సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే అక్టోబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్తవుతాయని తెలిపారు.

ఈ సందర్భంగానే మూసీ, ఈసీపై ఇప్పుడు 545 కోట్లతో 14 వంతెనలకు శంకుస్థాప‌న చేసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. నిధులు పెరిగినా ప‌ర్వాలేదు కానీ హైద‌రాబాద్‌ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాలని అన్నారు. అంతేకాదు శాశ్వతంగా, దీర్ఘకాలికంగా ఉండేలా ఈ 14 వంతెనల నిర్మాణం చేప‌డుతామ‌ని పేర్కొన్నారు. 2000 మిలియ‌న్ లీట‌ర్స్ ఫ‌ర్ డే కెపాసిటీతో ఎస్టీపీల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. అలాగే దుర్గం చెరువు వ‌ద్ద 7 ఎంఎల్‌డీ కెపాసిటీ ఎస్టీపీని నిర్మించినట్లు పేర్కొన్నారు. అయితే ఎస్టీపీలు పూర్తయితే మూసీ నదిలోకి పూర్తి స్థాయి శుద్ధి చేసిన నీటిని వ‌దిలే ప‌రిస్థితి ఉంటుందని చెప్పారు. అలాగే మంచిరేవుల – ఘ‌ట్‌కేస‌ర్ వ‌ర‌కు మూసీ న‌దిని అద్భుతంగా సుంద‌రీక‌రించాల‌ని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ క‌ల‌ను నెర‌వేరుస్తామని పేర్కొన్నారు.

అలాగే ఒక్కొక్కటిగా సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లను పూర్తి చేసి వంతెనలు క‌డుతున్నామని పేర్కొన్నారు. అయితే దాదాపు 160 కిలోమీట‌ర్ల వరకు ఓఆర్ఆర్ చుట్టూ తిర‌గ‌కుండా మ‌ధ్యలో మూసీ న‌ది మీదుగా వెళ్లే విధంగా వంతెనలు నిర్మిస్తామని పేర్కొన్నారు. అయితే 5 వేల కోట్ల రూపాయలతో రెండో విడుత ఎస్ఎన్‌డీపీని కూడా త్వరలోనే చేప‌డుతామని పేర్కొన్నారు. అలాగే జీవో 118లో ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న చిన్న సాంకేతిక సమస్యలను సైతం త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. ఇదిలా ఉండగా.. మరోవైపు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్.. 115 నియోజకవర్గాలకు చెందిన తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేశారు. అలాగే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం త్వరలోనే తమ పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..