Minister KTR: ఎలెన్ మస్క్ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ సెటైర్లు.. తనకు ఆ ట్యాగ్ రావడానికి చాలా టైమ్ పట్టొచ్చని చురకలు..
పెంపుడు కుక్కను ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ సరదాగా స్పందించారు. ఇతన ఖాతా వెరీఫైడ్ ట్యాగ్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తనకు అర్థమైందంటూ..
![Minister KTR: ఎలెన్ మస్క్ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ సెటైర్లు.. తనకు ఆ ట్యాగ్ రావడానికి చాలా టైమ్ పట్టొచ్చని చురకలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/minister-ktr-on-elon-musk.jpg?w=1280)
ఎప్పుడూ ట్వి్ట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తారకరామారావు (కేటీఆర్).. తాజాగా సెటైరికల్ ట్వీట్ చేశారు. ఎలన్ మస్క్ తాజాగా చేసిన ట్విట్‌పై తనదైన తరహాలో స్పందించారు. “నా ధృవీకరణ బ్యాడ్జ్‌ని పొందడానికి చాలా సమయం పట్టడంలో ఆశ్చర్యం లేదు” అంటూ ట్వీట్ చేయడంతో నవ్వులు పూయిస్తోంది. పెంపుడు కుక్కను ట్విట్టర్ సీఈఓ బాధ్యతలను అప్పగించారు.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో అందరికీ షాకిస్తున్న ఎలెన్ మస్క్.. తాజాగా.. ట్విట్టర్ సీఈఓగా తన పెంపుడు శునకం ఫ్లోకీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ఆఫీసులో సీఈఓ టీ షర్ట్ వేసుకొని ఉన్న కుక్క ఫొటోని ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేయడం పెద్ద సంచలనంగా మారింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్లోకీ ఇదివరకున్న ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కంటే మెరుగ్గా పనిచేస్తుందని క్యాప్షన్ పెట్టాడు. దీనిపై స్పంధించిన నెటిజెన్స్ రకరకాలుగా.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఈ ఫోటో చూసిన తర్వాత తన ఖాతాకు బ్లూ టిక్ ధృవీకరణ వచ్చే అవకాశంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
No wonder it’s taking inordinately long to get my verification badge ?
The new CEO looks cool ? https://t.co/mq2c9H85be
— KTR (@KTRBRS) February 17, 2023
అసలేం జరిగిందంటే..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ఖాతా నుంచి ఉన్నట్టుండి వెరీఫైడ్ ట్యాగ్ తొలిగించబడింది. ఏం జరిగిందో తెలియట్లేదు కానీ కేటీఆర్ అకౌంట్ నుంచి వెరిఫైడ్ బ్లూటిక్ మిస్సయ్యింది. దీంతో కేటీఆర్ అకౌంట్ ఇప్పుడు నాన్ వెరిఫైడ్‌గానే చూపిస్తోంది. ప్రస్తుతం కేటీఆర్‌ను 3.8 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఆయన 161 మందిని మాత్రమే ఫాలో చేస్తున్నారు. ఒక్క బ్లూ టిక్ తప్పితే మిగిలినది అంతా సరిగ్గానే ఉంది. ఈ వెరిఫైడ్ విషయంలో మస్క్ ట్విట్టర్‌ను దక్కించుకున్నప్పటి నుంచి పెద్ద సమస్యే కొనసాగుతోంది.
అప్డేట్ అవ్వడానికి కాస్త సమయం తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే.. వెరిఫైడ్ అకౌంట్ కోసం కేటీఆర్ మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదన్న మాట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం