KTR: వారి త్యాగం మరువలేనిది.. ఆ రైతులకు 100 గ‌జాల చొప్పున ప్లాట్లు.. మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..

|

May 07, 2022 | 6:17 PM

ప్రాజెక్టుల‌కు భూములు ఇచ్చే రైతుల త్యాగాలు వెల‌క‌ట్టలేనివంటూ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అలాంటి రైతులకు ఎంత చేసినా త‌క్కువేనని.. వారికి ఏమిచ్చినా రుణం తీర‌దంటూ పేర్కొన్నారు.

KTR: వారి త్యాగం మరువలేనిది.. ఆ రైతులకు 100 గ‌జాల చొప్పున ప్లాట్లు.. మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..
Ktr
Follow us on

KTR in Warangal: తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ.. ప్రాజెక్టుల‌కు భూములిచ్చిన రైతులంద‌రికీ పాదాభివంద‌నాలు చేస్తున్నాన‌న్నాని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కిటెక్స్ టెక్స్ టైల్స్ ఇండస్ట్రీతో ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలోని వేలాది మందికి ఉపాధి అవ‌కాశాలు రాబోతున్నాయ‌ంటూ పేర్కొన్నారు. రైతులు క‌ష్టమైనా, న‌ష్టమైనా ఓర్చుకొని ఇబ్బందైనా త‌ట్టుకొని భూములు ఇచ్చిన వారంద‌రికీ పేరుపేరునా పాదాభివంద‌నాలు చేస్తున్నానన్నారు.

ఇది చిన్న త్యాగం కాదని.. ప్రాజెక్టుల‌కు భూములు ఇచ్చే రైతుల త్యాగాలు వెల‌క‌ట్టలేనివంటూ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అలాంటి రైతులకు ఎంత చేసినా త‌క్కువేనని.. వారికి ఏమిచ్చినా రుణం తీర‌దంటూ పేర్కొన్నారు. కొంత మంది న‌ష్టపోతే చాలా మందికి లాభం జ‌రుగుతుంద‌న్న ఆలోచ‌నతో పెద్ద మ‌న‌సుతో భూములు ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు. భూములు ఇచ్చిన రైతులంద‌రికీ 100 గ‌జాల చొప్పున ప్లాట్లు ఇవ్వాల‌ంటూ అధికారులకు సూచించారు. భూములిచ్చిన రైతులందరికీ ఖ‌చ్చితంగా ప్లాట్లు ఇస్తామ‌ని మాటిస్తున్నాన‌ని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులకు లాభం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Also Read:

Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్.. ఏ విషయంలో అంటే..?

KTR on Rahul: ధమ్ బిర్యానీ తిని, డైలాగ్‌లు కొట్టిపోతారు.. రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ సెటైర్లు!