Hyderabad: నగరవాసులకు బిగ్ రిలీఫ్‌.. ఆ రూట్లలో ఇక నో ట్రాఫిక్‌.. అందుబాటులోకి కొత్త ఫ్లైఓవర్..

|

Mar 25, 2023 | 6:17 PM

రూ.32 కోట్ల వ్యయంతో 760 మీటర్ల పొడవు, 12 మీటర్లు వెడల్పుతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఏపీ నుంచి ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలతో పాటు హయత్‌నగర్‌ మీదుగా ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ప్రయాణించే అవకాశం వచ్చింది.

Hyderabad: నగరవాసులకు బిగ్ రిలీఫ్‌.. ఆ రూట్లలో ఇక నో ట్రాఫిక్‌.. అందుబాటులోకి కొత్త ఫ్లైఓవర్..
Lb Nagar Flyover
Follow us on

హైదరాబాద్ మహానగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ తో నగర వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో, ఫ్లైఓవర్స్, స్కై సిటీస్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ క్రమంలోనే నిత్యం రద్దీ గా ఉండే ఎల్బీనగర్‌లో ట్రాఫిక్ జామ్ ఇక్కట్లు తీర్చేందుకు ప్రభుత్వం కొత్త ఫ్లై ఓవర్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్‌ ఆర్‌హెచ్‌ఎస్‌ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో విజయవాడ వైపు నుంచి హైదరబాద్ నగరంలోకి ప్రవేశించే ప్రయాణికులు, వాహనదారులకు ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇక ట్రాఫిక్ కష్టాలకు గ్రీన్‌ సిగ్నల్‌ పడినట్టయింది.

ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి కి గుర్తుగా ఎల్బీనగర్ చౌరస్తాకు అతడిపేరు పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్, ఎయిర్ పోర్టుకు మెట్రో సౌకర్యం కల్పిస్తామన్నారు. మెట్రోను హయత్ నగర్ వరకు విస్తరిస్తామన్నారు. ఇప్పటి వరకు అన్ని ఫ్లై ఓవర్లు పూర్తయ్యాయన్నారు. సెప్టెంబర్ లో మూడు ఫ్లైఓవర్లు పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎల్బీ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించాలనే ఉద్దేశ్యంతో రూ.32 కోట్ల వ్యయంతో 760 మీటర్ల పొడవు, 12 మీటర్లు వెడల్పుతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఏపీ నుంచి ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలతో పాటు హయత్‌నగర్‌ మీదుగా ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ప్రయాణించే అవకాశం వచ్చింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం…