KTR: మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం.. దుబాయ్‌ వేదికగా జరగనున్న ప్రతిష్మాత్మక కార్యక్రమం.

|

Apr 22, 2023 | 8:15 PM

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం వచ్చింది. దుబాయ్‌లో జరగనున్న ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందించారు. దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. జూన్‌ 7,9 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో..

KTR: మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం.. దుబాయ్‌ వేదికగా జరగనున్న ప్రతిష్మాత్మక కార్యక్రమం.
Minister Ktr
Follow us on

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం వచ్చింది. దుబాయ్‌లో జరగనున్న ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందించారు. దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. జూన్‌ 7,9 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అనే అంశంపై చర్చించనున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వైపు చూస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఆరోగ్య రంగం, రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సాధించిన విజయాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. వివిధ దేశాల నుంచి పాల్గొంటున్న ప్రతినిధులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో తమ అనుభవాలు, సాధించిన ఘనతలను వివరించనున్నారు. ఇక 41వ గ్లోబల్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..