Minister KTR: దౌర్జన్యాన్ని ఉపేక్షించం.. MIM కార్పొరేటర్ రౌడియిజంపై కేటీఆర్ ఫైర్.. ఏమన్నారంటే..?

|

Apr 06, 2022 | 11:30 AM

Minister KTR advised DGP: హైదరాబాద్‌లో మజ్లిస్ కార్పొరేటర్ రౌడియిజంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పెట్రోలింగ్ పోలీసులకు..

Minister KTR: దౌర్జన్యాన్ని ఉపేక్షించం.. MIM కార్పొరేటర్ రౌడియిజంపై కేటీఆర్ ఫైర్.. ఏమన్నారంటే..?
Ktr
Follow us on

Minister KTR advised DGP: హైదరాబాద్‌లో మజ్లిస్ కార్పొరేటర్ రౌడియిజంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పెట్రోలింగ్ పోలీసులకు.. కార్పొరేటర్ గౌసుద్దీన్ తాహా మంగళవారం రాత్రి అనుచితంగా మాట్లాడాడు. రంజాన్‌ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ.. భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ (MIM Corporator Ghousuddin Taha) పేర్కొన్నాడు. మీరంతా వంద రూపాయలకు పనిచేసే వ్యక్తులు అంటూ.. రుబాబు ప్రదర్శించాడు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసి ఇప్పటికే ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ సిటీలో మజ్లిస్‌ వాళ్లకు ఒక రూలు, ఇతరులకు మరో రూల్ ఉందా అంటూ రాజాసింగ్ పోలీసులను ప్రశ్నించారు. అందరికీ ఒకే రూల్‌ అమలు చేయడం చేతకాకపోతే… మజ్లిస్‌ వాళ్లను మాకు అప్పగించండి.. వాళ్లకు అర్థమయ్యే భాషలో తాము చెప్తామంటూ పేర్కొన్నారు. కాగా.. తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్ రౌడీయిజంపై మంత్రి కేటీఆర్ (KTR) సీరియస్‌ అయ్యారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడమే కాకుండా దౌర్జన్యం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమన్న మంత్రి స్పష్టంచేశారు. కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్.. డీజీపీకి సూచించారు. ఈ మేరకు ట్విట్ చేశారు.

కాగా.. పోలీసులపై దౌర్జన్యానికి దిగిన MIM కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌పై ఇప్పటికే IPC 353, 506 సెక్షన్ల కింద ముషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. మంత్రి KTR సూచనతో కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌పై కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Also Read:

Watch Video: ఏం చేసుకుంటారో చేసుకోండి.. పోలీసులపై రెచ్చిపోయిన ఎంఐఎం కార్పొరేటర్‌.. రాజాసింగ్ ఏమన్నారంటే..?

Hyderabad: మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి.. కారణం అదేనా..?