
కోనసీమకు దిష్టి తగిలింది.. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కూడా కారణమన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడారంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణలో పవన్ కల్యాణ్ సినిమాలు ఆడవు.. రిలీజ్ కావు అంటూ మంత్రి కోమటిరెడ్డి తేల్చి చెప్పారు.
అంతేకాకుండా.. కోమటిరెడ్డి మరికొన్ని కీలక కామెంట్లు కూడా చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయంతోనే ఆంధ్రాను అభివృద్ధి చేసుకున్నారన్నారు. వరంగల్, నిజామాబాద్‌లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆంధ్రానే డెవలప్ చేసుకున్నారన్నారు. నీళ్లవాటాల్లో అన్యాయన్నీ గుర్తు చేశారు.
ఇదిలాఉంటే.. ఇటీవల కోనసీమలో పర్యటించిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేశనపల్లిలో కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతినడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే కోనసీమకు దిష్టి తగిలిందని.. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కూడా కారణమంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
పవన్ చేసిన ఈ కామెట్లకు వెంటనే BRS నుంచి రియాక్షన్ వచ్చింది. ఇటు.. YCP నేతలూ తప్పుపట్టారు. పవన్ వ్యాఖ్యలపై జగదీష్‌రెడ్డి, అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ.. ఇలా అనడం కరెక్ట్ కాదంటూ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..