
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం, మహిళలకు రూ.2500 పథకంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివరాం పెద్దకొత్తపల్లిలో ఇందిరా మహిళ శక్తి చీరలు, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మహిళలకు చెక్కలు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..తులం బంగారం, రూ.2500 పెన్షన్లు ఏమయ్యాయని కొందరు మాట్లాడుతున్నారని అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు ఇచ్చే లక్ష రూపాయలకే ప్రభుత్వానికి రూ. 4వేల కోట్ల ఖర్చు అవుతోంది.. దానికి పాటు తులం బంగారం కూడా మరో లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో ప్రభుత్వంపై మొత్తంగా మరో 4వేల కోట్ల ఖర్చు అవుతుంది. అలాగే మహిళలకు రూ.2500 పథకం అమలు చేయాలంటే రూ.10000 కోట్లు ఖర్చు అవుతుంది.
ఈ రెండు పథకాలకు సుమారుగా 15వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం అప్పు తెచ్చి వడ్డీ కడుతోందని.. ప్రభుత్వం ప్రతి ఏడాదికి గత ప్రభుత్వం తెచ్చిన అప్పుల వడ్డీలకే రూ.75 వేల కోట్లు కడుతుందన్నారు. అప్పుడు ఇంతలా అప్పులు చేయకుంటే.. వాటికి ఇప్పుడు వడ్డీలు కట్టేది లేకుంటే ఈ పథకాలు అమలు చేసేటివేగా అని చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మేము ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నాం అన్నారు.
వీడియో చూడండి..
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అవుతున్న ఖర్చు కంటే కేసీఆర్ చేసిన బాకీకి కడుతున్న వడ్డీ ఎక్కువగా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం మితిమీరి చేసిన అప్పుల వల్లే ఇప్పుడు హామీల అమలులో కొంత జాప్యం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పు కంటే పదింతల అప్పులు చేసి రాష్ట్రాన్ని… pic.twitter.com/ohPpNKuV57
— Jupally Krishna Rao (@jupallyk_rao) November 22, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.