Harish Rao: వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా బోధన: మంత్రి హరీశ్‌రావు
Ambedkar Jayanti 2022: వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను అందజేసేందుకు కృషి చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Ambedkar Jayanti 2022: వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను అందజేసేందుకు కృషి చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా మరింత మంది పేద దళిత విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా 7300 కోట్ల రూపాయలతో మన ఊరు మన బడి కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపడతామని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లాలో అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ‘అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పిస్తూ దళితుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కేవలం దళితుల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నాం. ఇక దేశానికి దళిత బందు ఆదర్శంగా నిలిచింది. 17800 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది దళితులకు దళితబందు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. అదేవిధంగా విడతలవారీగా ప్రతి పేద దళిత కుటుంబానికి రైతుబంధు అందజేస్తాం’
దళిత విద్యార్థులకు కార్పొరేట్ విద్య..
‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు రెట్టింపయ్యాయి. 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, మహిళా రెసిడెన్షియల్ పీజీ, లా కాలేజీలను నెలకొల్పాం. మన విద్యావ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. దళిత విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద 20 లక్షల రూపాయలు గ్రాంటు అందిస్తున్నాం. ఇంజనీరింగ్ నిర్మాణాలలో ఎస్సీలకు 16 శాతం రిజర్వేషన్ జీవో తీసుకొచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా 56 ఆస్పత్రుల ఎస్సీలకు డైట్, శానిటేషన్ పనుల్లో రిజర్వేషన్ కల్పించాం. అంబేద్కర్ భవనాల్లో ఎస్ సీ విద్యార్థులు చదువుకునేందుకు లైబ్రరీలు ఏర్పాటు చేసేందుకు నిధులిచ్చాం. సిద్దిపేట తాత్కాలిక జిల్లాలో కోటి రూపాయలతో అంబేద్కర్ భవన్ ను అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీ ద్వారా చర్యలు చేపడుతాం. వచ్చే అంబేద్కర్ జయంతి లోగా సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతాం. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తున్నాం. 7300 కోట్ల రూపాయలతో మన ఊరు మన బడి కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం.బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా మరింత మంది పేద దళిత విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటాం. సిద్దిపేటలో నిర్మాణంలో ఉన్న రెండు శ్మశాన వాటికలను ఉద్యానవనాల మాదిరిగా అభివృద్ధి చేస్తాం. ఈ ఏడాది సిద్దిపేట పట్టణంలో సొంత ఇంటి జాగా కలిగిన 500 మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తాం’ అని హరీశ్ రావు తెలిపారు.
Priyamani: మల్టీకలర్ శారీలో మత్తెక్కించే ఫోజులు ప్రియమణి లేటెస్ట్ పిక్స్
Health Tips: ముఖంపై ముడతలకి ఈ ఆయిల్‌తో చెక్.. రాత్రిపూట ఇలా అప్లై చేయండి..!