Errabelli: బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు.. జేపీ నడ్డా సమక్షంలో..!
Errabelli Pradeep Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు,వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్‌ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం గం. 5.00కు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరనున్నారు.

తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికారమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తోంది తెలంగాణ బీజేపీ. ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలను ఆకర్షించే పనిలో పడింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు,వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్‌ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డితోపాటే ప్రదీప్ రావు సైతం ఈనెల 7న ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాల్సి ఉన్నా.. వాయిదా పడింది. ఈ సాయంత్రం గం. 5.00కు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరనున్నారు. ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసమే వేదిక ఆయన బీజేపీలో చేరనున్నారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీ కండువ కప్పుకోనున్నారు.
2018 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడిన ప్రదీప్‌రావు.. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశానంటూ.. స్థానిక ఎమ్మెల్యే అవమానపరిచేలా మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం