MIM Party: కేసీఆర్‌కే తమ మద్దతు అంటూ.. రేవంత్ రెడ్డిపై అసద్ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ మామను గెలిపించుకుందాం.. ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నను ఇంట్లో కూర్చోబెడదాం అంటూ పిలుపునిచ్చారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. వికారాబాద్‌లోని చిగుళ్లపల్లి గ్రౌండ్‌లో నిర్వహించిన ముస్లిం మైనారిటీ జల్సా కార్యక్రమంలో పాల్గొన్నారు అసద్. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్, బీజేపీలపై అసదుద్దీన్ నిప్పులు చేరిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్, బీజేపీలపై అసదుద్దీన్ నిప్పులు చేరిగారు.

MIM Party: కేసీఆర్‌కే తమ మద్దతు అంటూ.. రేవంత్ రెడ్డిపై అసద్ కీలక వ్యాఖ్యలు
Mim Leader Asaduddin Owaisi Comments On Tpcc Chief Revanth Reddy And Says He Will Support Cm Kcr

Edited By:

Updated on: Nov 17, 2023 | 12:11 PM

కేసీఆర్ మామను గెలిపించుకుందాం.. ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నను ఇంట్లో కూర్చోబెడదాం అంటూ పిలుపునిచ్చారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. వికారాబాద్‌లోని చిగుళ్లపల్లి గ్రౌండ్‌లో నిర్వహించిన ముస్లిం మైనారిటీ జల్సా కార్యక్రమంలో పాల్గొన్నారు అసద్. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్, బీజేపీలపై అసదుద్దీన్ నిప్పులు చేరిగారు. తెలంగాణలో నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో మన బీఆర్ఎస్ అధినేత, గులాబీ బాస్ కేసీఆర్ మామకు మద్దతిచ్చి, ఆర్‌ఎస్‌ఎస్ అన్న రేవంత్ రెడ్డిని ఇంటికే పరిమితం చేయాలన్నారు అసదుద్దీన్.

కాంగ్రెస్.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పుచేతుల్లో నడుస్తూ, గాంధీభవన్ కాస్తా ఆర్ఎస్ఎస్ భవన్‌గా మారిందని విమర్శించారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్ ఒక లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రెండు పార్టీలు వేరైనా ఏజెండా ఒక్కట్టేనంటూ విమర్శించారు అసద్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెడ్డీల నుంచి ప్యాంటుకొస్తే.. ఆర్ఎస్ఎస్ అన్న రేవంత్ చేడ్డీలు వేసేటప్పుడే ఆర్ఎస్ఎస్‌లో పనిచేశారన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్, బీజేపీలో పనిచేసి దాని భావజాలాన్ని కొనసాగింపుగా ఇప్పుడు కాంగ్రెస్‌లో తన వ్యూహాలను అమలు చేస్తుండని ఆరోపించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు అసదుద్దీన్. రాహుల్ గాంధీ మాట్లాడితే ఎంఐఎం డబ్బులు తీసుకోని మద్దతిస్తుంది అంటారు. అసద్‌ను డబ్బులు పెట్టి కోనే సత్తా దేశంలో ఎవ్వరికీ లేదన్నారు. కేసీఆర్‌కు సపోర్ట్ చేస్తే డబ్బులు తీసుకున్నారని అంటున్నారు. మరీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో మీకు మద్దతిచ్ఛాం. మీరేంతిచ్చాలో చెప్పాలి అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. నిజంగా మీ దగ్గర డబ్బు తీసుకున్నట్లు అధారాలు ఉంటే బయటపెట్టండీ అని సవాల్ విసిరారు అసదుద్దీన్.

ఇవి కూడా చదవండి

గోషామహల్‌లో ఎంఐఎం పోటీపై అసదుద్దీన్..

మా పార్టీ.. మా ఇష్టం. మాకు కొన్ని లెక్కలు, పాలసీలు, పార్టీ భవిష్యత్తు కోసం కొన్ని వ్యూహాలు ఉంటాయి. మా పార్టీ పోటీ చేయకపోతే మీకేందుకు అలక అంటూ కాంగ్రెస్, రాహుల్ గాంధీ విమర్శలకు కౌంటరిచ్చారు అసద్. ఎంఐఎం నాయకులకు సైతం తెలంగాణలో నిజామాబాద్, భైంసా, తాండూరు తదితర ప్రాంతాల్లో పోటీ చేయాలని ఒత్తిళ్లు ఉన్నాయి. కానీ మైనార్టీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పోటీ చేయడం లేదు అంటూ ఈ మధ్య గోషామహాల్ కాంట్రవర్సీపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అసద్. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎంఐఎం రాజేంద్ర నగర్, జూబ్లీ హిల్స్ లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ అన్న రేవంత్ జూబ్లీహిల్స్‌లో బ్యాట్ తిప్పేట్టోడికి టికెట్ ఇచ్చారు అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. వికారాబాద్ జిల్లాకు వికారాబాద్ పేరు పెట్టాలని కేసీఆర్‌ను పట్టుబట్టింది ఎంఐఎం పార్టీ అని గుర్తి చేశారు. మేము లేకపోతే అనంతగిరిగా మారేది అంటూ వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరోసారి గుర్తు చేశారు.

ఎంఐఎంతోనే మైనారిటీలకు గౌరవం.

కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఎక్కడున్నా మైనార్టీలను చిన్నచూపే చూస్తారు, గౌవరం ఇవ్వరు. అందుకే మూడో పార్టీ మామ పార్టీ బీఆర్ఎస్‌ ఉంటేనే మనకు గౌరవం అన్నారు అసద్. రానున్న ఎన్నికల్లో మామ కేసీఆర్‌కు మద్దతిస్తాం. జిల్లాలో మాకు కొన్ని కోరికలు ఉన్నాయి వాటిని తీర్చే బాధ్యత ఎంపీ రంజిత్ రెడ్డిదే అన్నారు. మా కోరికలు తీరిస్తే వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో ఎంపీ రంజిత్ రెడ్డికి ఢిల్లీ వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందిదని పరోక్షంగా హెచ్చరించారు. మామ కేసీఆర్‌కు ఇచ్చిన మాట కోసం వికారాబాద్, పరిగి, తాండూరులలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి అని ప్రజలను కోరారు. కొడంగల్‌లో ఆర్ఎస్ఎస్ అన్న రేవంత్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టాలని ఆ పార్టీ కార్యకర్తను కోరారు. చివరగా రాహుల్ పెళ్లిపై పంచులు వేశారు అసద్. ఎవరు కూడా వంటరిగా ఉండకూడదని.. అందుకే పెళ్లి చేసుకొని జతగా ఉండాలని రాహుల్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..