Skill University: స్కిల్ యూనివర్సిటీలోకి ఆ కంపెనీ ఎంట్రీ.. కట్ చేస్తే మారిన సీన్..!

| Edited By: Velpula Bharath Rao

Oct 30, 2024 | 10:04 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మేఘా కంపెనీ ఎంట్రీతో స్పీడప్ అయినట్లు తెలుస్తుంది. ఈ యూనివర్సిటీని మీర్‌ఖాన్‌పేట, కందుకూరులో 57 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం ప్రారంభిస్తోంది.

Skill University: స్కిల్ యూనివర్సిటీలోకి ఆ కంపెనీ ఎంట్రీ.. కట్ చేస్తే మారిన సీన్..!
Young India Skill University
Follow us on

తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మీర్‌ఖాన్‌పేట, కందుకూరులో 57 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభిస్తోంది. ఈ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం 6,000 మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, క్లాస్‌రూమ్ బ్లాక్స్, వర్క్‌షాపులు, బాలుర, బాలికల హాస్టల్స్, డైనింగ్ హాల్, స్టాఫ్ క్వార్టర్స్ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. వీటితో పాటు ఆడిటోరియం, లైబ్రరీ, పార్కింగ్ ప్రాంతం, పచ్చదనం కోసం విస్తృత స్థలాన్ని అందిస్తున్నారు.

యూనివర్సిటీ భవనాలపై సోలార్ ప్యానెళ్లు అమర్చి, విద్యుత్తు వినియోగాన్ని తగ్గిస్తున్నారు. కొన్ని భవనాల్లో సహజ రీతిలో గాలి, వెలుతురు చొరబడేలా రూపొందించారు. ఇది వాతావరణాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మేఘా కంపెనీ, ఇతర ఇంజనీరింగ్ బృందాలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమై పని చేస్తున్నాయి. మేఘా కంపెనీ రూ.200 కోట్లు, అదానీ గ్రూప్ రూ.100 కోట్లు విరాళంగా అందించాయి. ఈ నిధులతో యూనివర్సిటీకి భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రాజెక్ట్ నవంబర్ 6న ప్రారంభం కానుంది. ఎనిమిది నుంచి పది నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కొత్త తరానికి నైపుణ్య విద్యలో అవగాహన కల్పించి, ఉద్యోగ అవకాశాలు అందించేందుకు సిద్ధమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..