Venu Swamy: వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై వ్యాఖ్యలు..
ఈ ఏడాది ఆగస్టులో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నాగచైతన్య-శోభితల ఎంగేజ్ మెంట్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు నాగార్జున. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నాగ చైతన్య-శోభితలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
గతంలో సమంత – చైతన్య విడిపోయినట్లే నాగచైతన్య – శోభిత కూడా విడాకులు తీసుకుంటారని అప్పట్లో జోస్యం చెప్పారు వేణు స్వామి. దీంతో ఆయన వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అంతేకాదు ఫిల్మ్ జర్మలిస్ట్ అసోసియేషన్ కూడా ఈయన వ్యాఖ్యలపై సీరియస్ అయింది. వేణు స్వామిపై ఏకంగా మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలంది.
అయితే వేణుస్వామి మాత్రం మహిళా కమిషన్ కు తనను విచారించే అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం వేణుస్వామిపై చర్యలు తీసుకోవద్దంటూ మహిళా కమిషన్ ను ఆదేశించింది. స్టే కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇదే విషయంలో వేణు స్వామికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. గతంలో ఇచ్చిన స్టేను ఎత్తి వేస్తూ వేణస్వామిని విచారించేందుకు మహిళా కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని తెలిపింది. వారంలోగా వేణుస్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు హైకోర్టు సూచించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.