Medak: సొంత పార్టీ అభ్యర్థికి ఓట్లు రావంటూ కౌన్సిలర్ ఛాలెంజ్.. ఓడి గుండు గీయించుకున్న వైనం

| Edited By: Surya Kala

Dec 05, 2023 | 9:57 AM

ఒకొక్కసారి ఇందుకు భిన్నంగా తమ వ్యక్తిగత వైరం కోపం ఎక్కువ అంటూ సొంత పార్టీ నేతల చెడునే కోరుకునేవారుంటారు. అందుకు ఉదాహరణగా నిలిచింది తెలంగాణ ఎన్నికల్లో లెక్కింపు తర్వాత జరిగిన ఓ సంఘటన. సొంత పార్టీ అభ్యర్థికి ఓట్లు రావంటూ ఛాలెంజ్ చేశాడు ఓ కౌన్సిలర్. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో తీరా ఎక్కువ ఓట్లు రావడంతో గుండు గీయించుకున్నాడు.

Medak: సొంత పార్టీ అభ్యర్థికి ఓట్లు రావంటూ కౌన్సిలర్ ఛాలెంజ్.. ఓడి గుండు గీయించుకున్న వైనం
Gundu Challenge
Follow us on

రాజకీయాలు వేరు అభిమానం వేరు.. అందునా తెలుగు రాష్ట్రాల్లో జరిగే రాజకీయాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. తమ్ముడు తమ్ముడే.. పార్టీ పార్టీనే అంటారు. ఒక ఒకే పార్టీలో ఉంటూ ఒకరికొన్నారు విబేధించుకునేవారున్నారు. అయితే ఒకొక్కసారి అధిష్టానం మాటకు విలువ ఇచ్చి ఇష్టమున్నా లేకపోయినా కలిసి పని చేస్తారు. విజయం సాధించాలని కోరుకుంటారు. అయితే ఒకొక్కసారి ఇందుకు భిన్నంగా తమ వ్యక్తిగత వైరం కోపం ఎక్కువ అంటూ సొంత పార్టీ నేతల చెడునే కోరుకునేవారుంటారు. అందుకు ఉదాహరణగా నిలిచింది తెలంగాణ ఎన్నికల్లో లెక్కింపు తర్వాత జరిగిన ఓ సంఘటన. సొంత పార్టీ అభ్యర్థికి ఓట్లు రావంటూ ఛాలెంజ్ చేశాడు ఓ కౌన్సిలర్. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో తీరా ఎక్కువ ఓట్లు రావడంతో గుండు గీయించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పద్మా దేవేందర్ రెడ్డి ఓటమి పాలైనా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. దీనికి కారణం మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట మున్సిపాలిటీ.. ఇక్కడ బీఆర్ ఎస్ అభ్యర్థి పద్మారెడ్డి కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యత వస్తుందని.. అలా జరగకపోతే, గుండు గీయించుకొని పట్టణంలో తిరుగుతానని బీఆర్ ఎస్ కౌన్సిలర్ గంగాధర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అయితే ఎన్నికల ఓట్లు లెక్కింపు సమయంలో పద్మా దేవేందర్ రెడ్డికి రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ ఆద్యార్థి కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో తాను చేసిన ఛాలెంజ్ లో ఓటమిని అంగీకరిస్తూ గంగాధర్ గుండు గీయించుకున్నాడు. ఇప్పుడు ఈ గుండు ఛాలెంజ్ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..