Medak Collector Respond: తనపై వచ్చిన ఆరోపణలపై మెదక్ కలెక్టర్ స్పందించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున చేసిన ఆరోపణలపై కలెక్టర్ హరీష్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మాసాయిపేట మండలం అచ్చంపేటలోని సర్వే నెంబర్ 81, 130లలో పట్టాభూమి లేదు, సీలింగ్, అసైన్డ్ మాత్రమే ఉందని కలెక్టర్ తెలిపారు. రెండు సర్వే నెంబర్లలో 8.36 ఎకరాల భూమిని చట్ట విరుద్ధంగా తన పేరిట జమున కొనుగోలు చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. ఆ భూమి పై ఎలాంటి హక్కు లేని రామ రావ్ దగ్గర నుండి కొనుగోలు చేశారని అన్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చట్ట విరుద్ధమని అన్నారు.
రెండు సర్వే నెంబర్లలోని 33 ఎకరాల భూమిని గతంలో 18 మంది పేదలకు పంపిణీ చేశారని ఆయన పేర్కొన్నారు. సర్వే నెంబర్ 130 లో ఉన్నది మొత్తం అసైన్డ్ భూమి అని కలెక్టర్ తెల్చారు. ఈ సర్వే నంబర్ లో గల అసైన్ భూమిని 11 మంది అసైన్ దారులదని తెలిపారు. ప్రభుత్వ భూమిలో జమున హేచరీస్ యాజమాన్యం రోడ్లు, భారీ పౌల్ట్రీ షెడ్లను అక్రమంగా నిర్మించారన్నారు. ఈ భూమిని అక్రమంగా కొనుగోళ్లు చేసి తెల్లకాగితలలో లావాదేవీల చేసినట్టు రికార్డులు ఉన్నాయని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. భూముల సర్వే సమయంలో కూడా జామున హేచరిస్ ప్రతినిధులు పంచనామా లో సంతకాలు చేశారని గుర్తు చేశారు. అలాగే సర్వే 81 లో కూడా భూమి లేని 7గురికి అసైన్డ్ చేయబడిందని అన్నారు. భూముల సర్వే సమయంలో జమున హేచరీస్ ప్రతినిధులు హాజరై పంచనామాలో సంతకాలు చేశారని కలెక్టర్ తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే జమున ప్రెస్‌మీట్‌లో మరోలా మాట్లాడారని కలెక్టర్ పేర్కొన్నారు.
అలాగే కలెక్టర్ హరీష్‌పై ఈటల సమున చేసిన ఆరోపణలను జిల్లా అధికారుల సంఘం ఖండించింది. జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్‌ను పార్టీ కండువా కప్పుకోవాలని మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల మేరకు ఉద్యోగులు పని చేస్తారని జిల్లా అధికారుల సంఘం తెలిపింది. విధులను సక్రమంగా నిర్వర్తించే అధికారులకు రాజకీయాలు ఆపాదించడం భావ్యం కాదు. అధికారులను కించపరిచేలా మాట్లాడే సంప్రదాయాన్ని మానుకోవాలని హితవు పలికింది.
ఈ సర్వే నంబర్ లో ఉన్న చేసిన 5 ఎకరాల 36 గుంటల భూమిని జమున చట్టవిరుద్దం గా రిజిస్ట్రేషన్ చేసుకుందని అన్నారు. ఈ భూమి పై ఎలాంటి హక్కు లేని శ్రీరామరావు నుంచి కొనుగోలు చేసినట్టు ఉందని అన్నారు. ఈ భూమి మొత్తం 2011 నుంచి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని తెలిపారు.
Read Also…Diamond: రైతును వరించిన అదృష్టం.. తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన వజ్రం..