Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు మృతి

హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘనటలో ఐదుగురు మృతి చెందారు. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు..

Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు మృతి
Secunderabad Fire Accident

Updated on: Mar 17, 2023 | 12:19 AM

హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘనటలో ఐదుగురు మృతి చెందారు. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ లోని 7, 8 అంతస్తుల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో కాంప్లెక్స్ లోని పలు ఆఫీస్‌లు, షాప్‌లు తగలబడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాద సమయంలో ఆఫీసుల్లోనే కొందరు ఉద్యోగులు ఉన్నారు. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో పలు బట్టల షాప్‌లు, గోడౌన్‌లు ఉన్నాయి.. వారిలో ఉన్న వారు తమను కాపాడాలంటూ అర్తనాదాలు పెడుతున్నారు. అయితే మంటల్లో చిక్కుకున్న వారిని రెస్య్కూ టీమ్‌ రక్షించగా, ఐదుగురు మృతి చెందారు. అయితే ముందుగా ఐదో ఫ్లోర్ లో ఉన్న ఐదుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివ అనే మరో వ్యక్తి మృతి చెందారు.

మృతులు ఐదో ఫ్లోర్‌లోని కంపెనీ సిబ్బంది. మృతులు ప్రమీల, వెన్నెల, శ్రావణి, ప్రశాంత్‌, త్రివేణిలుగా గుర్తించారు. అయితే బాత్‌రూమ్‌లోనే లాక్‌ చేసుకుని ఉన్న ఆరుగురిలో ఐదుగురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మృతులంతా 25 ఏళ్లలో ఉన్నవారే ఉన్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి