khammam pigeon: ఖమ్మంలో వాలిన అనుమానాస్పద పావురం.. రెక్కలపై వింత కోడ్‌..! స్థానికుల్లో హడల్‌..!!

అందరికి ఏదో తెలియని ఆందోళన, ఆశ్చర్యం. ఎక్కడిది ఈ పావురం..! ఎందుకొచ్చింది..అనే సందేహలు సర్వత్ర వ్యక్తం చేస్తున్నారు.

khammam pigeon: ఖమ్మంలో వాలిన అనుమానాస్పద పావురం.. రెక్కలపై వింత కోడ్‌..! స్థానికుల్లో హడల్‌..!!
Pigeon
Follow us

|

Updated on: Mar 16, 2023 | 7:34 PM

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మామునూరులో ఓ పావురం కలకలం రేపింది. మామునూరులో అనుమానాస్పదంగా కనిపించిన పావురం స్థానికుల్లో భయాందోళన రెక్కేత్తించింది. పావురం కాలికి ట్యాగ్ ఉండటంతో ఈవార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే పావురం రెక్కలపై ఉన్న ముద్ర చూస్తుంటే ఇది తమిళనాడుకు చెందినట్లుగా స్థానికులు భావించారు. దాని రెక్కలపై Delta1000KM అని ముద్ర వేసి ఉంది. పొరుగు రాష్ట్రం పావురాన్ని గుర్తించిన గ్రామస్తులు దానిని పంచాయతీ సెక్రెటరీకి అందజేశారు.

అయితే, ఎక్కడి నుంచో వచ్చిన పావురం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల్ని మాత్రమే కాదు.. సోషల్ మీడియా గ్రూప్‌లలో కూడా అనుమానాస్పద పావురం వైరల్‌గా మారింది. ఈ పావురం రెక్కలపై ఉన్న ముద్ర ప్రకారం తమిళనాడుకు చెందినదిగా భావిస్తున్నారు. తమిళనాడు ట్యాగ్‌తో ఉన్న పావురం ఖమ్మం జిల్లాలోకి రావడంపై జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం వల్ల ప్రమాదం పొంచి ఉందా లేక ..ఏదైనా అరిష్టం జరుగుతుందా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు స్థానికులు. ఇలా పావురాలతో ఎవరైనా సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

కాని అందరికి మాత్రం ఏదో తెలియని ఆందోళన, ఆశ్చర్యం. ఎక్కడిది ఈ పావురం..! ఎందుకొచ్చింది..అనే సందేహలు సర్వత్ర వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సెక్రట్రీకి అప్పగించినప్పటికి అనుమానం తీరకపోవడంతో విషయాన్ని పోలీసులకు చేరవేశారు గ్రామస్తులు. సోషల్ మీడియాలో పావురం ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..