Chhattisgarh Encounter: అవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్స్.. దానికి బాధ్యత వారిదే.. మావోయిస్టుల వార్నింగ్

| Edited By: Surya Kala

May 16, 2024 | 6:47 PM

గత కొంతకాలంగా ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ల పై సంచలన లేఖ విడుదల చేశారు మావోయిస్టులు.. ఈ లేఖలో అవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్స్.. దానికి బాధ్యత వారిదే అంటూ మావోయిస్టుల వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమానికి బీజేపీ నేతలే బాధ్యత వహించాలంటూ హెచ్చరిక జారీ చేశారు మావోయిస్టులు

Chhattisgarh Encounter: అవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్స్.. దానికి బాధ్యత వారిదే.. మావోయిస్టుల వార్నింగ్
Maoist Release A Letter
Follow us on

ఇటీవల కాలంలో మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న ఛత్తీస్ ఘడ్ లో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్స్ జరుగుతుండడంతో పదుల సంఖ్యలో మావోలు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్లలో కొందరు కీలక నేతలు మరణించారు. అయితే తాజాగా మావోలు ఘాటైన హెచ్చరికలు చేస్తూ ఒక లెటర్ ను విడుదల చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట సంచలన లేఖ విడుదల చేసారు మావోయిస్టులు. గత ఐదు నెలల్లో 27 ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో 18 ఫేక్ ఎన్ కౌంటర్లేనని ఆరోపించారు. ఈ ఎన్ కౌంటర్స్ లో 107 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో 45 మంది వరకు సాధారణ పౌరులేనని చెప్పారు. మేము చర్చలకు సిద్ధమని చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఈ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.

అంతేకాదు ఫేక్ ఎన్ కౌంటర్లు అని.. ప్రధాని మోడీ, అమిత్ షా, విష్ణు దేవ్ సాయి, విజయ్ శర్మ ఆదేశాలతోనే మావోయిస్టులపై ద్రోహపూరిత దాడులు జరుగుతున్నాయని చెప్పారు. భద్రతాబలగాల విజయాల కోసం భారీ సంఖ్యలో మావోయిస్టులపై దాడులు చేస్తూ.. అవి ఎన్ కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారనీ మండి పడ్డారు. శత్రుదేశాలపై యుద్ధం తరహాలో మావోయిస్టులపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. భారీగా సాయుధ బలగాలను మోహరించి మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమానికి బీజేపీ నేతలే బాధ్యత వహించాలంటూ హెచ్చరిక జారీ చేశారు మావోయిస్టులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..