Maoist Letter: అతనికి శిక్ష తప్పదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ మావోల లేఖ.. కారణం ఏంటంటే..!

Maoist Letter: తెలంగాణలో ములుగు జిల్లాలో మితిమీరుతున్న ఇసుక మాఫియాపై మావోయిస్టులు కన్నేశారు. తాజాగా మాఫియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Maoist Letter: అతనికి శిక్ష తప్పదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ మావోల లేఖ.. కారణం ఏంటంటే..!

Updated on: Jan 03, 2022 | 12:39 PM

Maoist Letter: తెలంగాణలో ములుగు జిల్లాలో మితిమీరుతున్న ఇసుక మాఫియాపై మావోయిస్టులు కన్నేశారు. తాజాగా మాఫియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారికి శిక్ష తప్పదని హెచ్చరిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఈ వార్నింగ్ లేఖను విడుదల చేశారు. గోదావరి పరివాహక గ్రామాల్లో పచ్చని పల్లెల మధ్య ఇసుక వ్యాపారులు చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటిల పేరుతో ఆదివాసీలను గ్రూపులుగా చీల్చి వారిని రెచ్చగొడుతున్నారని అన్నారు.

కోదాడకు చెందిన ఇసుక వ్యాపారి ఇక్కడ మకాం వేసి ఆదివాసీలను పావుగా ఆడుకుంటున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఆ వ్యక్తికి శిక్ష తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ లేఖను వదిలారు. ఈ వార్నింగ్ లేఖ ములుగు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నిజంగా సాండ్ మాఫియాకు మూడిందా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు మావోల లేఖ నేపథ్యంలో పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. అన్నల జాడ కోసం గాలింపు మొదలు పెట్టారు.

Also read:

Money Deposits: అకౌంట్‌లో పడ్డ 170 మిలియన్ డాలర్ల డబ్బు.. అంతలోనే ట్విస్ట్ ఇచ్చిన బ్యాంక్..!

Pakistan PM Ex-Wife: ఇదేనా నయా పాకిస్తాన్?.. ప్రధాని ఇమ్రాన్‌పై దుమ్మెత్తిపోసిన మాజీ భార్య..

Telangana Farmers: తెలంగాణలో రూటు మారుస్తున్న రైతన్నలు.. అండగా ఉంటామంటున్న ప్రభుత్వం.. ఇంతకీ ఏం జరుగుతోందంటే..!