Hyderabad: నిమ్స్ సర్జన్‌గా పులిహోర కలిపాడు.. ట్రీట్మెంట్‌ పేరుతో లాడ్జికి తీసుకెళ్లాడు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

|

Jun 08, 2023 | 4:21 PM

రైళ్లో కలిసి ప్రయాణించారు. ఇంతకు ముందు ఒకరికి ఒకరు పరిచయమే లేదు. కానీ, ట్రైన్ జర్నీ.. వారిద్దరి మధ్య మాటలు కలిపింది. అసలే మాయగాడు.. ముందుగా అతనే హాయ్ అంటూ పలకరించారు. అలా పరిచయం కాస్తా, కబుర్లు వరకు వెళ్లింది. ఇక ఈ కేటుగాడు..

Hyderabad: నిమ్స్ సర్జన్‌గా పులిహోర కలిపాడు.. ట్రీట్మెంట్‌ పేరుతో లాడ్జికి తీసుకెళ్లాడు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
Doctor
Follow us on

రైళ్లో కలిసి ప్రయాణించారు. ఇంతకు ముందు ఒకరికి ఒకరు పరిచయమే లేదు. కానీ, ట్రైన్ జర్నీ.. వారిద్దరి మధ్య మాటలు కలిపింది. అసలే మాయగాడు.. ముందుగా అతనే హాయ్ అంటూ పలకరించారు. అలా పరిచయం కాస్తా, కబుర్లు వరకు వెళ్లింది. ఇక ఈ కేటుగాడు.. తనను తాను నిమ్స్ హాస్పిటల్ సర్జన్‌గా పరిచయం చేసుకున్నాడు. తన మాయ మాటలతో.. ఆమెను నమ్మించాడు. ఆమె కూడా అతని వాలకం, మాట తీరు చూసి డాక్టర్ అనే నమ్మింది. కానీ, దారుణంగా మోసపోతే గానీ తెలిసిరాలేదు.. వాడొక జగత్జంత్రీ అని. ఈ ఘరానా మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సికింద్రాబాద్‌లో ఓ నకిలీ వైద్యులు తన చేతివాటం ప్రదర్శించాడు. ట్రీట్‌మెంట్‌ పేరుతో మహిళకు మత్తుమందు ఇచ్చి, ఆపై నిలువుదోపిడీ చేశాడు. రైళ్లో ప్రయాణిస్తుండగా.. ఈ కేటుగాడు బాధిత మహిళతో పరిచయం పెంచుకున్నాడు. నిమ్స్ ఆస్పత్రి సర్జన్‌గా చెప్పుకున్నాడు. వాడు చెప్పినవన్నీ నమ్మేసిన మహిళ.. ట్రీట్మెంట్ కోసం తన స్పెషల్ ఆఫీస్ అంటూ లాడ్జీలోని ఓ గదికి పిలిపించాడు. ప్రైవేట్ హాస్పిటల్ ఇలా రన్ చేస్తున్నాడేమో అనుకున్న మహిళ.. అతన్ని నమ్మి ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్లింది. అయితే, అందివచ్చిన అవకాశాన్ని ఆ కేటుగాడు తనదైశిలో ఉపయోగించుకున్నాడు. మహిళకు మత్తు టాబ్లెట్స్ ఇచ్చాడు. ఆమె స్పృహతప్పి పడిపోగానే.. ఒంటిపై ఉన్న బంగారం అంతా దోచుకుని పారిపోయాడు. స్పృహ వచ్చిన తరువాత చూస్తే.. ఎదుట డాక్టర్ లేదు, ఒంటిపై నగలు లేవు. దాంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు.. గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..