ముందు పరిచయం చేసుకుంటాడు.. ఆపై ఛాన్స్ దొరికితే చాలు.. గద్వాలలో వ్యక్తి ఆటకట్టించిన పోలీసులు..

ముందు పరిచయం చేసుకుంటాడు.. ఆపై ఛాన్స్ దొరికితే చాలు.. గద్వాలలో వ్యక్తి ఆటకట్టించిన పోలీసులు..
Arrest

Man Arrested in Gadwal: ముందు మహిళలతో పరిచయం చేసుకుంటాడు.. ఆ పరిచయంతో ఫోన్ నెంబర్ తీసుకుంటాడు.. ఆపై తన నిజస్వరూపాన్ని..

Shiva Prajapati

|

Apr 16, 2021 | 10:18 AM

Man Arrested in Gadwal: ముందు మహిళలతో పరిచయం చేసుకుంటాడు.. ఆ పరిచయంతో ఫోన్ నెంబర్ తీసుకుంటాడు.. ఆపై తన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తూ మహిళలను వేధింపులకు గురిచేస్తాడు. గద్వాలలో చెత్తపనులు చేస్తున్న ఓ వ్యక్తి ఆటకట్టించారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నర్స్‌కు గుర్త తెలియని వ్యక్తి కొన్ని రోజులుగా ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. లైంగిక కోరికలు తీర్చాలని వేధింపులకు గురి చేశాడు. అతని వేధింపులకు విసిగివేసారిపోయిన నర్స్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి. తీగ లాగితే ఆ పోకిరీ డొంకంతా కదిలింది.

అతని ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ పోలీసులు.. కోదండ వీరేష్ అనే వ్యక్తి తన పేర్లు మారుస్తూ తిరిగేవాడని గుర్తించారు. గతంలో హైదరాబాద్ సన్‌షైన్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా కూడా విధులు నిర్వర్తించేవాడని గుర్తించారు. అలా ఆస్పత్రికి వచ్చే నర్సులతో పరిచయం చేసుకుని, వారి ఫోన్ నెంబర్లు సేకరించి.. వారికి ఫోన్ చేసి వేధించేవాడు. దీనిపై రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు కావడంతో అతని పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ తరువాత మరో పేరు మార్చుకుని ముత్తూట్ ఫైనాన్స్‌లో సెక్యూరిటీ గార్డుగా చేస్తూ నర్స్‌లకు ఫోన్ చేసి వేధించేవాడు. ఇక కరోనా సంక్షోభాన్ని తన ఆసరాగా మార్చుకుని అమ్మాయిలకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి లోబరుచుకునేవాడు. అయితే, తన గతంలో సేకరించిన నర్సుల ఫోన్‌ నెంబర్లను ఫోన్ చేసి వారిని వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే గద్వాల ఘటనతో నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. అతనిపై 354 ఏ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

Also read:

IPL 2021: అరుదైన రికార్డుల వేటలో ఆ ముగ్గురు చెన్నై ఆటగాళ్లు.. పంజాబ్‌పై ఈ ఫీట్ అందుకునేనా.!

Thellavarithe Guruvaram: ఓటీటీలో టెలికాస్ట్ కానున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘తెల్లవారితే గురువారం’

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu