- Telugu News Photo Gallery Sports photos Ipl 2021 three chennai super kings players to achieve rare records vs punjab kings
IPL 2021: అరుదైన రికార్డుల వేటలో ఆ ముగ్గురు చెన్నై ఆటగాళ్లు.. పంజాబ్‌పై ఈ ఫీట్ అందుకునేనా.!
ఐపీఎల్ 14వ సీజన్ ఎనిమిదో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌తో తలబడనుంది. ఈ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.
Updated on: Apr 16, 2021 | 10:05 AM


చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్‌లో 500 ఫోర్లు, 200 సిక్సర్లు సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లోనే రైనా ఈ రెండు రికార్డులను అందుకునే అవకాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా ఐపీఎల్‌లో ప్రత్యేక స్థానానికి చేరుకోబోతున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై 50 వికెట్లు పూర్తి చేసే అవకాశం చాహర్‌కు ఉంది. అతను తన 50 వికెట్లకు అడుగు దూరంలో ఉన్నాడు.

అదే సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఐపీఎల్‌లో 50 వికెట్లు పూర్తి చేయబోతున్నాడు, చాహర్ మాదిరిగా పంజాబ్ కింగ్స్‌పై ఈ రికార్డును పూర్తి చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ హెన్రిక్స్ ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేయడానికి దగ్గరగా ఉన్నాడు. ఇతగాడు 128.17 స్ట్రైక్ రేట్‌లో 57 మ్యాచ్‌ల్లో 969 పరుగులు చేశాడు. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకునే అవకాశం




