తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో జోరు పెంచడంతో పాటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే విడుదల చేశారు. సుమారు 42పేజీలతో, 62 అంశాలను ప్రస్తావించారు. గతంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా ఈ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారు. అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టోను రూపకల్పన చేశారు. తెలంగాణకు అవసరమైనన్ని అంశాలు ఇందులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు వేణుగోపాల్‌తో పాటూ రేవంత్ రెడ్డి తదితర తెలంగాణ నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను గీత, ఖురాన్, బైబిల్‌తో పోల్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ సృష్టించబోతోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా ఉంటుందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం.. ఖర్గే ధీమా
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. కేసీఆర్ పదవీ విరమణకు సమయం ఆసన్నమైందన్నారు. టాటా బాయ్ బాయ్ చెప్పి కేసీఆర్‌ను ఇంటికి సాగనంపుతామన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని.. అలాగే తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే..
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే..ప్రసంగం వీడియో
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..