Telangana: అలా అయితేనే పార్టీకి అధికారం.. ఈటల కీలక వ్యాఖ్యలు..

|

Jun 21, 2024 | 7:05 PM

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‎ను నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత వారికే రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కొందరి పట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అయినా సంపూర్ణ విజయం సాధించాలంటే కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు రావాలని చెప్పారు ఈటల. అలా వస్తేనే విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కారణం.. పాత వారికే రాష్ట్ర అధ్యక్షుని పదవీ బాధ్యతలు ఇస్తారన్న చర్చ ఓ వర్గంలో జరుగుతుండటమే అని కొందరు భావిస్తున్నారు.

Telangana: అలా అయితేనే పార్టీకి అధికారం.. ఈటల కీలక వ్యాఖ్యలు..
Mp Eetala Rajender
Follow us on

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‎ను నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత వారికే రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కొందరి పట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అయినా సంపూర్ణ విజయం సాధించాలంటే కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు రావాలని చెప్పారు ఈటల. అలా వస్తేనే విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కారణం.. పాత వారికే రాష్ట్ర అధ్యక్షుని పదవీ బాధ్యతలు ఇస్తారన్న చర్చ ఓ వర్గంలో జరుగుతుండటమే అని కొందరు భావిస్తున్నారు.

ఈ తరుణంలోనే కొత్త నీరు, కొత్త శక్తి యాడ్ అయితేనే పార్టీకి అధికారం సాధ్యం అన్నారు ఈటల. పార్టీలో పాత, కొత్త నాయకులలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని ఈ సందర్భంగా చెప్పారు. కొత్త పాత నాయకులను సమన్వయం చేసుకొని పార్టీ ముందుకు వెళ్తుందని తెలిపారు. పార్టీ అంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోవడం కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను తక్కువ చూడకూడదని వివరించారు. అన్ని ఎన్నికల్లో బీజేపీ గట్టిగా కొట్లాడుతుందని ధీమాను వ్యక్తం చేశారు. కార్యకర్తలు లేకుండా పార్టీ లేదని.. ఏ పార్టీలో అయినా కార్యకర్తలు ఇంటికి పునాది రాళ్ళలాంటి వాళ్ళని కొనియాడారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..