CM Revanth Reddy: అన్నదాతలకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా సమాయత్తమవుతోంది.. ఈ మేరకు పంట రుణాల మాఫీకి తెలంగాణ కేబినెట్ ఆమోదముద్రవేసింది.. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలకు వర్తించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.. కేబినెట్ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూడండి..
తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా సమాయత్తమవుతోంది.. ఈ మేరకు పంట రుణాల మాఫీకి తెలంగాణ కేబినెట్ ఆమోదముద్రవేసింది.. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలకు వర్తించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.. కేబినెట్ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. రూ.2లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణాలు మాఫీ చేయడానికి 31వేల కోట్లు అవసరం అవుతాయన్నారు.
రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ నియమించామని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో సబ్ కమిటీ పనిచేస్తుందన్నారు. కమిటీ సభ్యులుగా శ్రీధర్‌బాబు, పొంగులేటి, తుమ్మల ఉంటారన్నారు. జులై 15వ తేదీలోపు సబ్ కమిటీ నివేదిక ఇస్తుంది.. అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అమలుచేస్తామన్నారు.