Watch Video: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
బీజేపీ అధిష్టానానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక కీలక సూచన చేశారు. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకం చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశమయ్యాయి. కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని విన్నవించారు.
బీజేపీ అధిష్టానానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక కీలక సూచన చేశారు. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకం చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశమయ్యాయి. కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని విన్నవించారు. తెలంగాణలో గెలుపొందిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపిలతోపాటూ ఇతర సినీయర్ నేతల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాతే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలని కోరారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలన చూశారని.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన చూస్తున్నారని చెప్పారు. ఈక్రమంలోనే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

