Watch Video: ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఆఫీసుల్లో ఈడీ సోదాలు ముగిశాయి. గత రెండు రోజుల నుంచి సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఈ రెండు రోజుల సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. మైనింగ్ ద్వారా 300 కోట్ల రూపాయల అక్రమ సంపాదన పొందినట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు ఈడీ అధికారులు అంచనా వేశారు.
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఆఫీసుల్లో ఈడీ సోదాలు ముగిశాయి. గత రెండు రోజుల నుంచి సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఈ రెండు రోజుల సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. మైనింగ్ ద్వారా 300 కోట్ల రూపాయల అక్రమ సంపాదన పొందినట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు ఈడీ అధికారులు అంచనా వేశారు. సంతోష్ శ్యాండ్ & గ్రానైట్ సప్లైస్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటూ 19 లక్షల రూపాయల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు రోజుల్లో దాదాపు 10 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు.. గూడెం సోదరులకు చెందిన బ్యాంక్ లాకర్లు సీజ్ చేసి, అకౌంట్లలోని నగదు లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..