BRS Party: ‘శంకర్ నాయక్‌ వద్దు, కొత్త అభ్యర్థి ముద్దు’.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అసమ్మతి సెగ..

Mahbubnagar: మహబూబాబాద్ బీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు సొంతపార్టీలోనే అసమ్మతి సెగ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ అనుచరులు తిరుగుబావుటా ఎగురవేశారు. ఇంకా ఈ ఎమ్మెల్యే తమకు వద్దంటూ నినాదించారు.

BRS Party: ‘శంకర్ నాయక్‌ వద్దు, కొత్త అభ్యర్థి ముద్దు’.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అసమ్మతి సెగ..
MLA Shankar Naik
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 09, 2023 | 7:46 AM

Mahbubnagar: మహబూబాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్‌రావు వర్గాలంటూ రెండుగా చీలిపోయారు. ఈ క్రమంలోనే ‘మాకు వద్దు ఈ ఎమ్మెల్యే’ అంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పట్టణ శివారులోని ఓ మామిడి తోటలో దాదాపు 100 మంది ప్రజాప్రతినిధులు శనివారం సమావేశమయ్యారు. మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. శంకర్ నాయక్‌కు టికెట్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి.. నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు కౌన్సిలర్లు.

‘శంకర్ నాయక్‌ వద్దు.. కొత్తవ్యక్తి ముద్దు’ అనే నినాదాలు చేశారు పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు. మహబూబాబాద్ నియోజకవర్గంలో భూకబ్జాలకు, సెటిల్ మెంట్లకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమకు వద్దంటూ అధిష్టానాన్ని సదరు నాయకులు కోరారు. సొంత నేతలనూ ప్రొత్సహిస్తూ ఉద్యమకారులను అవమానిస్తున్నారంటూ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై ఆరోపణలు చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు