CM Revanth Reddy: గ్యారంటీల్లో రెండు పూర్తి.. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాంః సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ చరిత్రలో రేవంత్‌రెడ్డి సర్కార్ చరిత్ర సృష్టించింది. ఆర్టీసీ బస్సుల్లో ఆడవారికి ఉచిత ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం ప్రారంభించారు.
తెలంగాణ చరిత్రలో రేవంత్‌రెడ్డి సర్కార్ చరిత్ర సృష్టించింది. ఆర్టీసీ బస్సుల్లో ఆడవారికి ఉచిత ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక వరల్డ్ ఛాంపియన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల ఆర్టిక సాయాన్ని రేవంత్ అందించారు. తెలంగాణ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే, అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్, మంత్రులు, ప్రొటెం స్పీకర్ ప్రారంభించారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీల్లో ఉచితం ప్రయాణానికి అనుమతిస్తారు. మహాలక్ష్మీ పథకాన్ని అసెంబ్లీ ఆవరణలో మూడు బస్‌లను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఆరోగ్య శ్రీ పథకాన్ని సైతం సీఎం రేవంత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగ రోజు లాంటిదన్నారు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియకు బీజం పడిన రోజు అని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందన్న రేవంత్.. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలను ఇచ్చిన ఘనత సోనియా గాంధీ సొంతం అన్నారు. ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేస్తున్నామన్న ఆయన, త్వరలో మిగిలిన హామీలను నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.