
రాజకీయాల్లో పురుషుల ఆధిక్యత ఎక్కువ అవుతుందనే.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కోసం ఏళ్ల తరబడి పోరాటం సాగింది. ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందనే నమ్మకం ఏర్పడింది. ఈ బిల్లు ఆశతో రాజకీయాల్లో అవకాశాలు మెండు అనే నమ్మకం సగటు మహిళా కార్యకర్తలకు పెరిగింది. ఈ నేపథ్యంలో మహిళ దినోత్సవ వేళ.. రాజకీయాల్లోకి రావాలన్నా, రాణించాలన్న ఎం చేయాలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కుటుంబ జీవితాన్ని త్యాగం చేయాల్సిందే: డీకే అరుణ
రాజకీయాల్లోకి వచ్చే మహిళలు ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్‌ను త్యాగం చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు డీకే అరుణ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఫ్యామిలీకి టైమ్ కేటాయించే వీలు ఉండదన్నారు. 24 గంటల పాటు ప్రజా సేవ కోసం కష్టపడితేనే రాజకీయాల్లో రాణించగలమని చెప్పారు. మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చాక ఎందుకు వచ్చామా అనే ఆలోచన చేయకుండా ఉండాలంటే ముందే అన్నిటికి ఓకే అనుకుంటేనా పాలిటిక్స్ లో అడుగుపెట్టాలన్నారు. బీజేపీ ఆఫీస్ లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా కార్యకర్తలకు ఆమె ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యం ముఖ్యమని.. అది బాగుంటేనే ఏదైనా చేయగలమని చెప్పారు. మహిళలు పనుల్లో పడి ఆరోగ్యాన్ని ఆశ్రద్ధ చేయవద్దని సూచించారు.
సీట్లు ఇస్తారు.. గెలిస్తే స్వీట్లు ఇస్తారు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరపున మహిళలకు ఎక్కువ సీట్లు ఇప్పించాలని డీకే అరుణను మహిళా మోర్చా నేతలు కోరగా.. నవ్వుతూ రాష్ట్ర నాయకత్వం మీకు సీట్లు ఇస్తారు.. గెలిస్తే స్వీట్స్ కూడా ఇస్తారంటూ స్పందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..