Mahabubnagar MLC Result: పాలమూరు.. ఊపిరి పీల్చుకో.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో లేనట్లే..!

| Edited By: Balaraju Goud

Apr 02, 2024 | 9:19 AM

వార్నీ..! ఇంత రసవత్తరంగా పోలింగ్ జరిగితే ఫలితాలు ఇప్పుడు కాదట..! పాలమూరు రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక టెన్షన్ మరో రెండు నెలలు కొనసాగాల్సిందే. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. గెలిచిన అభ్యర్థి పేరు ప్రకటిస్తరని భావిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుహ్య నిర్ణయంతో షాక్ ఇచ్చింది.

Mahabubnagar MLC Result: పాలమూరు.. ఊపిరి పీల్చుకో.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో లేనట్లే..!
Mahabubnagar Mlc Result
Follow us on

వార్నీ..! ఇంత రసవత్తరంగా పోలింగ్ జరిగితే ఫలితాలు ఇప్పుడు కాదట..! పాలమూరు రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక టెన్షన్ మరో రెండు నెలలు కొనసాగాల్సిందే. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. గెలిచిన అభ్యర్థి పేరు ప్రకటిస్తరని భావిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుహ్య నిర్ణయంతో షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

పార్లమెంట్ ఎన్నికల ముందే కాకరేపిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక వేడి పోలింగ్ ముగిసినా ఇంకా చల్లారకపోగా మరింత కాలం సాగబోతోంది. మార్చి 28న పోలింగ్ ముగియడంతో ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏఫ్రిల్ 2వ తేదిన ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాలలో 5 టేబుల్స్ చొప్పున మొత్తం 10 పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే అనూహ్య నిర్ణయంతో కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ కొనసాగుతున్న నేఫథ్యంలో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను నిలిపివేసింది. జూన్ 2వ తేదిన ఉదయం గం.8.00లకు తిరిగి ఓట్లు లెక్కించి, అనంతరం విజేత ప్రకటన చేయాలని అదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు తుస్సుమన్నారు. ఇక బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూమ్ ల్లోనే మరో రెండు నెలల పాటు భద్రపరచాలని అధికారులు నిర్ణయించారు.

సీఎంతో పాటుగా ఓటింగ్ లో పాల్లొన్న 1,437మంది

మార్చి 28న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,439మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్ల, ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండగా 1,437ఓట్లు పోలయ్యాయి. 99.86శాతం పోలింగ్ శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. అయితే పోలింగ్ ముగియడంతో గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ రోజున క్రాస్ ఓటింగ్ అంశం అటూ అభ్యర్థులు, ఇటు పార్టీల్లో కలకలం రేపింది. బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కు, బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ కు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు నేతలు అంచనాలు వేస్తున్నారు. అయితే జూన్ రెండో తేదీని ఈ ఉత్కంఠకు తెర పడుతుందని భావిస్తే ఈసీ నిర్ణయం షాక్ కు గురిచేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…