Mahabubabad: ప్రియురాలి బంధువుల బెదిరింపులకు భయపడిన ప్రియుడు ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాళ్లోకెళితే.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామ శివారు బోధ్యా తండాకు చెందిన బానోతు నరేష్, మల్యాల గ్రామ శివారు రేగడి తండాకు చెందిన యువతి గత ఎనిమిది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలవడంతో ప్రియురాలి తరుపు బంధువులు నరేష్ ను మందలించారు. ఈ మధ్య కాలంలో అమ్మాయికి వివాహం కుదరడంతో, యువతి తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంటానని తెగేసి చెప్పి.. ప్రియుడు నరేష్ ఇంటికి వెళ్ళింది. తనను పెళ్ళి చేసుకొమ్మని నరేష్‌ని కోరింది.
అయితే, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని నచ్చజెప్పి ప్రియురాలిని ఇంటికి పంపించాడు నరేష్. ఈ క్రమంలో స్వర్ణ బంధువులు మరో మారు అమ్మాయితో కనిపిస్తే భాగుండదంటూ నరేష్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నరేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు.. నరేష్‌ను వెంటనే జిల్లా ప్రధాన వైద్యశాలకు తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. నరేష్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..
Bike Loan: లోన్ తీసుకొని బైక్ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..
Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?