Lumpy Skin Disease: తెలంగాణాలోనూ లంపీ స్కిన్ కలకలం.. రెండు ఆవుల్లో వ్యాధి లక్షణాలు.. ఓ ఆవు పరిస్థితి విషమం

| Edited By: Janardhan Veluru

Oct 07, 2022 | 10:35 AM

భైంసా మండలం టాక్లి గ్రామంలో రెండు పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఓ ఆవు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం భైంసా డివిజన్ వ్యాప్తంగా 50 పశువులకు పైగా లంపి స్కిన్ వ్యాధి లక్షణాలున్నట్లు..

Lumpy Skin Disease: తెలంగాణాలోనూ లంపీ స్కిన్ కలకలం.. రెండు ఆవుల్లో వ్యాధి లక్షణాలు.. ఓ ఆవు పరిస్థితి విషమం
Lumpy Skin Disease
Follow us on

పశువులకు సోకే లంపీ స్కిన్ వ్యాధి దాదాపు రెండు నెలల క్రితం దేశంలో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించినా ఇప్పటి వరకు ఈ వ్యాధి అదుపులోకి రాలేదు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి మెరుగుపడడం లేదు. మరోవైపు మెల్లగా ఈ వ్యాధి ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణాలో ఈ లంపీ స్కిన్ వ్యాధి వ్యాపించిందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. నిర్మిల్ జిల్లాలోని భైంసా డివిజన్ లో రెండు పశువుల్లో లంపి స్కిన్ వ్యాధి లక్షణాలు కనిపించాయి.

భైంసా మండలం టాక్లి గ్రామంలో రెండు పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకినట్లు భావిస్తున్నారు. ఓ ఆవు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం భైంసా డివిజన్ వ్యాప్తంగా 50 పశువులకు పైగా లంపి స్కిన్ వ్యాధి లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో  పశువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. పశువులకు వేగంగా వ్యాక్సిన్ ను వేస్తున్నారు. అంతేకాదు అధికారులు మహారాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి పశువుల రవాణాను నిలిపివేశారు. గ్రామాల్లో పశువుల వార సంతలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి