AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 32 షాపులు.. భారీగా ఆస్తి నష్టం

కొండగట్టులో ఓ షాపులో షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీపంలోని షాపులకు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఏకంగా 32 షాపులు ఈ అగ్నిప్రమాదం వల్ల దగ్ధమయ్యాయి. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 32 షాపులు.. భారీగా ఆస్తి నష్టం
Kondagattu
Venkatrao Lella
|

Updated on: Nov 30, 2025 | 10:16 AM

Share

Fire Accident: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి వల్ల భారీగా ఆర్ధిక, ప్రాణ నష్టం జరుగుతోంది. శనివారం కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో పట్టణంలోని ఓ బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్క షాపులకు కూడా వ్యాపించడంతో మొత్తం 32 షాపులు పూర్తిగా దగ్ధమై భారీ ఎత్తున మంటలు, పొగలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో స్దానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

పట్టణంలోని కొండగట్టు స్టేజీ వద్ద ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. హనుమాన్‌ విగ్రహం నుంచి కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారి వరకు ఉన్న మొత్తం 32 బొమ్మల షాపులు దగ్ధమయ్యాయి. దీంతో షాపుల్లోని సామాగ్రి మొత్తం కాలి బూడిదవ్వడంతో భారీగా ఆస్తి నష్టం చేకూరింది. ఒక్కో షాపులో రూ.8 నుంచి రూ.10 లక్షల విలువైన సామాగ్రి దగ్థమైనట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ అగ్నిప్రమాదంతో రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది 12 గంటలకు చేరుకోగా.. అప్పటికే దుకాణాలు అన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి.  భారీగా ఆస్తి నష్టం జరగడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

ఒక షాపులో షార్ట్ సర్కూట్ అవ్వడం వల్లనే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మల్యాల సీఐ రవి, ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డిలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి