Road Mishap: ముందు బస్సు.. వెనుక లారీ.. ఒక్కసారిగా ఫెయిల్ అయిన బ్రేకులు.. క్షణంలో అంతా గందరగోళం..

|

Mar 08, 2021 | 10:40 PM

Road Mishap in Nirmal: ముందుగా ఆర్టీసీ బస్సు వెళ్తోంది.. దాని వెనుక లారీ వస్తోంది. అంతలో లారీ బ్రెకులు ఫెయిల్ అయ్యాయి. దాంతో ఊహించని..

Road Mishap: ముందు బస్సు.. వెనుక లారీ.. ఒక్కసారిగా ఫెయిల్ అయిన బ్రేకులు.. క్షణంలో అంతా గందరగోళం..
Follow us on

Road Mishap in Nirmal: ముందుగా ఆర్టీసీ బస్సు వెళ్తోంది.. దాని వెనుక లారీ వస్తోంది. అంతలో లారీ బ్రెకులు ఫెయిల్ అయ్యాయి. దాంతో ఊహించని ఈ పరిణామంతో అయోమయానికి గురైన లారీ డ్రైవర్.. లారీని నియంత్రించలేక బస్సును వెనుకవైపు నుంచి ఢీకొట్టాడు. ఆ తరువాత మరో వాహనమైన ఐచర్ వ్యాన్‌ను గుద్దేశాడు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్‌తో పాటు.. లారీ ఓనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘోర ప్రమాదం నిర్మల్ జిల్లాలోని ఘాట్ రోడ్డులో చోటు చేసుకుంది. అయితే బస్సులోని ఎవరికీ ప్రమాదం జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న లారీ.. బ్రేకులు ఫెయిల్ అవడంతో నిర్మల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఆ వెంటనే ముందు వెళ్తున్న ఐచర్ వ్యాన్‌ను ఢీకొట్టి బొల్తా పడింది.

ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ తో పాటు లారీ యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ పల్టిలి కొట్టడంతో దాని డ్రైవర్ లారీ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయాడు. ఆలుగడ్డల లోడ్ తో వెళుతున్న లారీ ఘాట్ సెక్షన్ లోకి రాగానే రనాపూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ప్రమాదం సమయంలో ఆర్టీసీ డ్రైవర్ అలర్ట్ అవడంతో బస్సు ఘాట్‌లోకి దూసుకెళ్లకుండా అదపు చేయగలిగాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇక ప్రమాదం నుండి క్షేమంగా బయటపటడంతో బస్సులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. తీవ్రగాయాల పాలైన క్షతగాత్రులిద్దరిని నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్ ను కాపాడి అతన్ని కూడా ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

UK lockdown: శాండ్‌విచ్ కోసం ఏకంగా 130 కి.మీ వెళ్లాడు.. అదికూడా హెలికాప్టర్‌లో.. వీడియో వైరల్

NASA Stunning Picture: అంతరిక్షంలో అందమైన పాలపుంత.. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన నాసా..