Lok Sabha Election: కమలం టిక్కెట్ కోసం నేతల క్యూ.. ఏకంగా ఎన్నారైలు, సినీ పెద్దలు, వ్యాపారవేత్తలు

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నారైలు, సినీ నటులు, వ్యాపార, సామాజికవేత్తలు, స్వామిజీలు పొలిటికల్ ఎంట్రీకి రెఢి అయిపోతున్నారు. రాకీయ అనుభవం లేకుండానే డైరెక్ట్‌గా ఎంపీ టికెట్ దక్కించుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ టికెట్ల కోసం లాబీయింగ్ మొదలెట్టారు. ఇంతకీ కాషాయపార్టీ టికెట్ కోసం పైరవీలు చేస్తున్న నేతలు ఎవరు ? టికెట్లు దక్కే ఛాన్స్ ఎంతవరకుంది ఉన్నారు..?

Lok Sabha Election: కమలం టిక్కెట్ కోసం నేతల క్యూ.. ఏకంగా ఎన్నారైలు, సినీ పెద్దలు,  వ్యాపారవేత్తలు
Ts Bjp
Follow us
Sridhar Prasad

| Edited By: Balaraju Goud

Updated on: Jan 11, 2024 | 3:23 PM

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నారైలు, సినీ నటులు, వ్యాపార, సామాజికవేత్తలు, స్వామిజీలు పొలిటికల్ ఎంట్రీకి రెఢి అయిపోతున్నారు. రాకీయ అనుభవం లేకుండానే డైరెక్ట్‌గా ఎంపీ టికెట్ దక్కించుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ టికెట్ల కోసం లాబీయింగ్ మొదలెట్టారు. ఇంతకీ కాషాయపార్టీ టికెట్ కోసం పైరవీలు చేస్తున్న నేతలు ఎవరు ? టికెట్లు దక్కే ఛాన్స్ ఎంతవరకుంది ఉన్నారు..? ఇది హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో పార్లమెంట్ ఎన్నికలకు డిమాండ్ పెరిగింది. అవకాశాన్ని దక్కించుకుని అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు పలువురు ఎన్నారైలు. సిట్టింగ్ ఎంపీలు ఉన్నచోట కూడా తమకు అవకాశం కల్పించాలని పలువురు ఎన్నారైలు పార్టీని కోరుతున్నారు. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని యుప్ టీవీ సీఈవో ఉదయ్ నందన్ రెడ్డి ఇటీవలే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారట. సంఘ్ పరివార్ క్షేత్రాల నుంచి ఉదయ్ నందన్ లాబీయింగ్ చేసుకుంటున్నారట.

ఇక నల్లగొండ లోక్ సభ స్థానానికి పోటీ ఎక్కువగానే ఉంది. బీజేపీ నుంచి అవకాశం కల్పించాలని మరో ఎన్నారై మన్నె రంజిత్ యాదవ్ కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నాగార్జునసాగర్ టికెట్ ఆశించి భంగపడ్డారు రంజిత్. ఇటీవలే బీజేపీ కండువా కప్పుకున్న ఎన్నారై మన్నె రంజిత్ యాదవ్.. బీజేపీ అగ్రనేతల కంట్లో పడేందుకు ప్రయత్నిస్తున్నారట. ఎలాగైనా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంది వచ్చే అన్ని అవకాశాలను వాడుకుంటున్నారట.

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విరంచి ఆస్పత్రి చైర్మన్ మాధవీలత కోరుతున్నారట. పాతబస్తీలో మహిళలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న మాధవీలత సామాజిక సేవా కోణంలో టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగను వరంగల్ నుంచి బరిలో దింపే అవకాశాలున్నాయని పార్టీలో ఇప్పటికే చర్చసాగుతోంది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి రెఢి అంటూ ప్రకటించారు బిచ్కుంద మఠాధిపతి సోమయ్యప్ప స్వామి.

ఇక ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం సినీ నటుడు సర్ధార్ అభినవ్ కేతావత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే కిషన్ రెడ్డి సమక్షంలో సర్ధార్ అభినవ్ పార్టీలో చేరారు. మొత్తానికి ఎన్నారైలు, సినీనటులు, స్వామిజీల ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో చూడాలి..!

 మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…