Medak Congress: కాంగ్రెస్‌లో అలజడి రేపుతున్న నేతల మధ్య గ్యాప్.. గెలుపు తీరాలకు చేర్చేనా..?

చాలా రోజుల సస్పెన్స్ తర్వాత ఆయనకు ఎంపీ సీట్ దక్కింది. అందరు అనుకున్నట్టుగానే ఆ పార్లమెంట్ పరిధిలో బీసీ నేతకే టికెట్ ఇచ్చింది ఆ పార్టీ..ఇక అక్కడ గెలవడం ఈజీనే అని ఆ పార్టీ నేతలు అనుకుంటున్న వేళ.. తాజాగా మరో సమస్య వచ్చి పడిందట ఆ ఎంపీ అభ్యర్థికి.. అతనితో కలిసి నడవడానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు ససేమిరా అంటున్నారట.. టికెట్ వచ్చిన తర్వాత కూడా ఆ నేతతో కలిసి రాని నేతలు ఎవరు..? ఇదంతా ఏ పార్లమెంట్ పరిధిలో..?

Medak Congress: కాంగ్రెస్‌లో అలజడి రేపుతున్న నేతల మధ్య గ్యాప్.. గెలుపు తీరాలకు చేర్చేనా..?
Neelam Madhu , Kata Srinivas Goud
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 04, 2024 | 8:56 AM

చాలా రోజుల సస్పెన్స్ తర్వాత ఆయనకు ఎంపీ సీట్ దక్కింది. అందరు అనుకున్నట్టుగానే ఆ పార్లమెంట్ పరిధిలో బీసీ నేతకే టికెట్ ఇచ్చింది ఆ పార్టీ..ఇక అక్కడ గెలవడం ఈజీనే అని ఆ పార్టీ నేతలు అనుకుంటున్న వేళ.. తాజాగా మరో సమస్య వచ్చి పడిందట ఆ ఎంపీ అభ్యర్థికి.. అతనితో కలిసి నడవడానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు ససేమిరా అంటున్నారట.. టికెట్ వచ్చిన తర్వాత కూడా ఆ నేతతో కలిసి రాని నేతలు ఎవరు..? ఇదంతా ఏ పార్లమెంట్ పరిధిలో..?

మెదక్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి వాతావరణం కన్పిస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిని ప్రకటించడానికి చాలా సమయం తీసుకుందట కాంగ్రెస్ పార్టీ. చివరికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధును మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారట కాంగ్రెస్ అధిష్టానం..ఇక్కడి వరకు అంత బాగానే ఉన్నా.. ప్రస్తుతం కొత్త సమస్య వచ్చి పడిందట. నీలం మధుకి బీసీ సామాజిక వర్గాన్ని చెందిన కొంతమంది సొంత పార్టీనేతలే సహాయ నిరాకరణ చేస్తున్నారట..

పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి నీలం మధు మధ్య ఉన్న గ్యాబ్ అలానే కొనసాగుతుందట. ఇద్దరు పటాన్‌చెరు నియోజక వర్గానికి చెందిన లీడర్లే. అయినా ఇద్దరి మధ్య బాండింగ్ అంత పెద్దగా ఎంలేదట.. ఎమ్మెల్యే ఎన్నికల నుండి వీరిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందట. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్న నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటి వరకు పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కాట శ్రీనివాస్ గౌడ్‌కే అని అందరు అనుకుంటున్నా వేళ.. నీలం మధు కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్యే టికె‌ట్‌ని నీలం మధుకు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు.

దీంతో గాంధీ భవన్ వద్ద రెండు, మూడు రోజులు పెద్ద ఎత్తున్న కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం నిరసనలు చేయడంతో ఎమ్మెల్యే టికెట్‌ను మళ్ళీ కాట శ్రీనివాస్ గౌడ్‌కు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లి బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేశాడు నీలం మధు. అప్పటి నుండే వీరి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు వచ్చాయట. ఎమ్మెల్యే ఎన్నికల నామినేషన్ అప్పుడు కూడా ఇరు వర్గాల కార్యకర్తలు పెద్ద ఎత్తున్న గొడవలకు దిగారట. ఇలా అప్పటి నుండి వీరిద్దరు ఉప్పు, నిప్పులా మారిపోయారట.

మరోవైపు ఎమ్మెల్యే ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ఓటమికి నీలం మధునే కారణము అని ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్ వర్గం ఆరోపిస్తుందట. ఎమ్మెల్యే ఎన్నికల్లో 7 వేల ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి బయటపడ్డారట..బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి లక్ష ఏడు వేల ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్ధి కాట శ్రీనివాస్ గౌడ్‌కు లక్ష ఓట్లు పోలయ్యాయి. ఇక బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసిన నీలం మధుకి 40 వేల ఓట్లు వచ్చాయి. సో నీలం మధు పోటీలో ఉండి ఓట్లు చీల్చాడని, ఆయన పోటీలో లేకుంటే పటాన్‌చెరులో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ గెలుపు నల్లేరు మీద నడకల ఉండేది అని కాట వర్గం భావిస్తుందట. ఇలా ఎమ్మెల్యే ఎన్నికల్లో నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వచ్చిన గ్యాప్ ఇప్పటికి అలానే కంటిన్యూ అవుతదట..!

అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఇద్దరు నేతలు కలిసిందే లేదట.. ఎంపీ అభ్యర్థిగా నీలం మధు పేరు ప్రకటించగానే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న చాలా మంది నేతలను కలిసాడట నీలం. కానీ ఇప్పటి వరకు కాట శ్రీనివాస్ గౌడ్‌ను మాత్రం కలవలేదట. కాట శ్రీనివాస్ కూడా ఇప్పటి వరకు నీలం మధును కలిసే ప్రయత్నం చేయలేదట.

ఇదిలావుంటే ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన గోడవలను కాట శ్రీనివాస్ గౌడ్ అంత ఈజీగా మరిచిపోవడం లేదట. ఎమ్మెల్యే టికెట్ విషయంలో, ఎన్నికల్లో తాను ఫేస్ చేసిన ఇబ్బందులను అంత ఈజీగా మరిచి, ఎంపీ ఎన్నికల్లో నీలం మధుకి సపోర్ట్ చేయడానికి కాట శ్రీనివాస్ గౌడ్ ఇష్టపడడం లేదని కాట అనుచరులు చెబుతున్నారు. కాట శ్రీనివాస్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ కులానికి చెందిన నేత. ఇతనికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాట శ్రీనివాస్ గౌడ్ కానీ, అతని సామాజిక వర్గం కానీ నీలం మధుకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరట..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మెదక్ ఎంపీ స్థానంను ఎలాగైనా గెలవాలని ఉంది. కానీ ఇక్కడ మాత్రము పరిస్థితి అందుకు భిన్నంగా ఉందట. ఈ ఇద్దరు నేతలు ఇలాగే దూరంగా ఉంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు అని అంటున్నారట సీనియర్లు. మరోవైపు ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనే సామెతను నీలం మధు పాటించాలని, ముందు సొంత నియోజకవర్గ నేతలపై దృష్టి సారించి, వారి మద్దతును కూడగొట్టే ప్రయత్నం చేయాలని, ఇలాగే అందరిని కాదని ముందుకు వెళ్తే నీలం మధుకి ఇబ్బందులు తప్పవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..