AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తాగినోళ్లకు తాగినంత.. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. రెచ్చిపోయిన మందుబాబులు..

రోజూ తాగుతున్నారు. చేతిలో ఎంత ఉంటే అంత ధర పెట్టి కొంటున్నారు. జేబుకు చిల్లు పడుతోంది.. కారణం ఏంటో ఆలస్యంగా తెలుసుకున్నారు మందు బాబులు. వేరే షాపుల కంటే ఇక్కడ మద్యం ధరలు అధికంగా ఉన్నాయని తెలుసుకుని వారితో వాగ్వాదానికి దిగారు. నిన్నటి వరకు ఒక ధర ఇప్పుడు సిండికేట్‎గా మారి.. అధిక ధరలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Watch Video: తాగినోళ్లకు తాగినంత.. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. రెచ్చిపోయిన మందుబాబులు..
Khammam Wine Shop
N Narayana Rao
| Edited By: Srikar T|

Updated on: Mar 21, 2024 | 1:18 PM

Share

రోజూ తాగుతున్నారు. చేతిలో ఎంత ఉంటే అంత ధర పెట్టి కొంటున్నారు. జేబుకు చిల్లు పడుతోంది.. కారణం ఏంటో ఆలస్యంగా తెలుసుకున్నారు మందు బాబులు. వేరే షాపుల కంటే ఇక్కడ మద్యం ధరలు అధికంగా ఉన్నాయని తెలుసుకుని వారితో వాగ్వాదానికి దిగారు. నిన్నటి వరకు ఒక ధర ఇప్పుడు సిండికేట్‎గా మారి.. అధిక ధరలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో నాలుగు బ్రాందీ షాపులను లూటీ చేశారు మందుబాబులు. దాడి చేసి బాటిల్లను ఎత్తుకెళ్లారు. సుమారు 50 లక్షల విలువచేసే మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లినట్లు షాపు యాజమాన్యులు అంటున్నారు. కొంతమంది మద్యం షాపులోకి వెళ్లి అధిక రేట్లకు అమ్ముతున్నారని షాపు యజమానులను నిలదీశారు. దీంతో షాప్ యజమానులకు మందుబాబులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అది చిలికి చిలికి గాలి వానలా మారి షాపులను లూటీ చేసే స్థితికి చేరింది. అందినకాడికి మద్యం బాటిళ్లను దోచుకొని వెళ్ళారు.

ఇదే అవకాశంగా అనుకుని అటుగా వెళ్ళే మహిళలు కూడా షాపులో ఉన్న మద్యం బాటిల్స్‎ను ఎత్తుకెళ్లారు. అయితే మద్యం షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం చేశారు. దీంతో పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్‎ఎస్‎కు చెందిన ఒక నేత ఆధీనంలో ఈ వైన్ షాపు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను ఇతర మద్యం వ్యాపారులతో కలిసి సిండికేట్‎గా మారి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ లోపు చాలా మంది మద్యం బాటిళ్లను బాక్సుల్లో ఎత్తుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..