Telangana: ‘ఆ తల్లికి చేతులెలా వచ్చాయో..’ ముళ్ళపోదల్లో అప్పుడే పుట్టిన నవజాత శిశువు

మాతృ ప్రేమ మలీనమవుతోంది. నవ మాసాలు మోసి కన్న బిడ్డను పొత్తిళ్ల నుంచే దూరం చేసుకుంటుంది. మానవత్వాన్ని మరిచిపోయేలా కన్న పేగు తెంచుకుని పుట్టిన పసికందును పోదల్లో వదిలేసింది ఓ తల్లి. లోకం కూడా చూడని పసికందును కఠినాత్ములు ముళ్లపొదల్లో పడేశారు. పడేసింది ఎవరు ? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. కానీ ఈ ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకుంది. అక్కడి ముళ్ళపోదల్లో స్థానికులకు..

Telangana: 'ఆ తల్లికి చేతులెలా వచ్చాయో..' ముళ్ళపోదల్లో అప్పుడే పుట్టిన నవజాత శిశువు
Baby Boy In Bushes
Follow us
M Revan Reddy

| Edited By: Srilakshmi C

Updated on: Jan 24, 2024 | 12:01 PM

కొండమల్లేపల్లి, జనవరి 24: మాతృ ప్రేమ మలీనమవుతోంది. నవ మాసాలు మోసి కన్న బిడ్డను పొత్తిళ్ల నుంచే దూరం చేసుకుంటుంది. మానవత్వాన్ని మరిచిపోయేలా కన్న పేగు తెంచుకుని పుట్టిన పసికందును పోదల్లో వదిలేసింది ఓ తల్లి. లోకం కూడా చూడని పసికందును కఠినాత్ములు ముళ్లపొదల్లో పడేశారు. పడేసింది ఎవరు ? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. కానీ ఈ ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకుంది. అక్కడి ముళ్ళపోదల్లో స్థానికులకు ఓ పసికందు కనిపించింది. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ళపోదల్లో పడేశారు. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికులకు రక్తస్రావంలో కేకలు వేస్తున్న చిన్నారి అరుపులు వినిపించాయి.

ముళ్ళ పొదల్లో కనిపించిన మగ శిశువును వెంటనే అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటారు. స్థానిక అంగన్వాడి టీచర్ కు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ అధికారులు వెంటనే దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. గ్రహణం మోర్రితో పుట్టినందుకే మగ శిశువును ముళ్ల పొదల్లో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కొండమల్లేపల్లి ప్రాంతంలో ఆసుపత్రుల్లో డెలివరీ అయిన మహిళల వివరాలను సేకరిస్తున్నారు.

మరో ఘటన: బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. భర్త మృతి, భార్యకు గాయాలు

నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మెడికల్‌ కళాశాల ఎదురుగా మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన మేరకు.. బిజినేపల్లి మండలం లింగసానిపల్లికి చెందిన దంపతులు తిరుమలేశ్‌, లక్ష్మి నాగర్‌కర్నూల్‌ ద్విచక్ర వాహనం పై స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తిరుమలేశ్‌ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య లక్ష్మి తీవ్రంగా గాయపడింది. నాగర్‌కర్నూల్‌ జనరల్‌ దవాఖానలో లక్ష్మి చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్‌ మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..