BRS MLAs Meet: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక ప్రెస్ మీట్..
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలవడం దుమారం రేపుతోంది. సెక్యూరిటీ, ప్రొటోకాల్ సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించేందుకే కలిశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. రాజకీయ ప్రాధాన్యత లేదని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. మరో రెండు వారాల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఊహాగానాలు ప్రచారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలవడం దుమారం రేపుతోంది. సెక్యూరిటీ, ప్రొటోకాల్ సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించేందుకే కలిశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. రాజకీయ ప్రాధాన్యత లేదని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. మరో రెండు వారాల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఊహాగానాలు ప్రచారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్, ప్రొటోకాల్ ఉల్లంఘన, గన్‌మెన్ల కుదింపు తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిశామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎస్‌డీఎఫ్ నిధులు అర్ధాంతరంగా ఆపేయడం వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా తమను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లెక్కలు.. లొల్లులు పక్కకు పెడితే.. OTTలోకి ‘యానిమల్’ వస్తుందోచ్
Captain Miller: చిక్కుల్లో ధనుష్.. కోలీవుడ్‌ను ఊపేస్తోన్న కెప్టెన్ మిల్లర్ వివాదం
Lavanya Tripathi: నో కండీషన్స్.. పొంగిపోయిన లావణ్య
బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ మొదలైన మహాద్భుత కార్యం
Sitara Ghattamaneni: తేలిగ్గా తీసుకోకండి.. ఇప్పుడే లక్షల్లో సంపాదిస్తోంది..