Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత పులి కలకలం.. ఏకంగా రన్ వే పై 10 నిమిషాల పాటు..
Shamshabad Airport: తెలంగాణ వ్యాప్తంగా రోజుకో చోట వన్యమృగాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పటి వరకు అటవీ ప్రాంతాల్లోని గ్రామ
Shamshabad Airport: తెలంగాణ వ్యాప్తంగా రోజుకో చోట వన్యమృగాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పటి వరకు అటవీ ప్రాంతాల్లోని గ్రామ శివారుల్లో మాత్రమే హల్‌చల్ చేసిన క్రూర మృగాలు.. ఇప్పుడు ఏకంగా నగరంలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేగింది. నిత్యం విమానాల శబ్దాలతో మోతమోగే శంషాబాద్ విమానాశ్రయంలోని రన్‌వే పై చిరుత పులి తచ్చాడింది. చిరుత పులి సంచారానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత రన్ వే పైకి చిరుత పులి వచ్చింది. దాదాపు 10 నిమిషాల పాటు సంచరించింది. ఆ తరువాత రషీద్ గూడ వైపు గోడ దూకి చిరుత వెళ్లిపోయింది. కాగా, చిరుత సంచారం గురించి తెలుసుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది.. అలర్ట్ అయ్యారు. మరోసారి చిరుత రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాగా, చిరుత పులి రషీద్ గూడ వెపు వెళ్లడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఎక్కడ ఉందో.. ఏ సమయంలో ఏ వైపు నుంచి వస్తుందో అని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.
Also read:
NTR 25th Death Anniversary: నేడు ఎన్టీఆర్ వర్దంతి.. నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ..