Leopard’s day out: తెలంగాణలో చిరుత పులుల సంఖ్య పెరిగిందా ? లేక ఉన్న చిరుత పులులే ఆహారం కోసం… జిల్లాలు మార్చుకుంటూ వేటాడుతున్నాయో తెలియడం లేదు. 24గంటల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం శివార్లలోని ఓ క్రషర్ దగ్గరకు చిరుత రావడం స్థానికంగా కలకలం రేపింది.
సరిగ్గా సాయంత్రం 5.30 గంటల సమయంలో క్రషర్ దగ్గరకొచ్చి… అటు.. ఇటు తిరగడాన్ని … క్రషర్ మిషన్ దగ్గర పనిచేస్తున్న బిహరీలు చూసి షాకయ్యారు. తమ దగ్గరున్న సెల్‌ఫోన్లలో షూట్ చేశారు. వీడియోలను గ్రామస్తులకు షేర్ చేశారు.
పట్టపగలే టైగర్ జనావాస ప్రాంతాల్లోకి వచ్చిందన్న వార్తతో దాడి తండా , శివారు తండా వాసులు భయంతో గజగజ వణికిపోయారు. ఇదే విషయాన్ని గ్రామ సర్పంచ్ మణెమ్మ ఫారెస్ట్ అధికారులకు చేరవేశారు. గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎవరూ ఒంటరిగా పొలాలకు, అడవులకు వెళ్లవద్దని టముకు సూచించారు సర్పంచ్ మణెమ్మ.
నిర్మల్ జిల్లాలో కూడా ఓ పులి తన పంజా పశువులపై విసిరింది. దస్తురాబాద్ మండలంలోని మున్యాల్ తండా సమీపంలోని గొర్రెల మందపై దాడి చేసింది. ఈ ఘటనలో నాలుగు గొర్రెలు మృతి చెందగా.. ఒకటి తీవ్రంగా గాయపడింది. గొర్రెల పాకలోని జీవాలు చనిపోయిన తీరు చూస్తే కచ్చితంగా పులే దాడి చేసి చంపిందని స్ధానికులు అంటున్నారు.
విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్తలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. తాము చెప్పే వరకు గ్రామస్తులు ఎవరూ నిర్మాష్యు ప్రదేశానికి, అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. పులుల సంచారంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు తండా వాసులు. అలాగని పనులకు వెళ్లకపోతే పూటగడిచేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
Bitcoin value jumps: ఎక్కడికీ ఈ పరుగు.. రోజు రోజుకు బిట్ కాయిన్ సరికొత్త కొత్త రికార్డులు..
GMC polls: కౌన్ బనేగా గుంటూర్ మేయర్? పదేళ్ల తర్వాత జరుగుతున్న పోరుపై హైటెన్షన్