Telangana: ఏదో అనుకుంటే ఇంకోదే జరిగిందే.. ఉండలేక ఉనికిని కాపాడుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేతలు.

| Edited By: Narender Vaitla

Jul 12, 2023 | 3:57 PM

ఎన్నికల ముందు ఏవేవో హామీలిస్తే అధికార పార్టీలో చేరారు. ఎన్నికల తర్వాత ఏం చేయాలో తోచక సైలెంట్ గా వుంటున్నారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నిక వరకు ఎంతో మంది సీనియర్ లు, జూనియర్ లు గులాబీ కండువా కప్పుకున్నారు. ఇప్పడు వాళ్లంతా ఏం చేస్తున్నారు.. ఏదైనా ఎన్నిక వచ్చిందంటే జంపు...

Telangana: ఏదో అనుకుంటే ఇంకోదే జరిగిందే.. ఉండలేక ఉనికిని కాపాడుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేతలు.
Telangana
Follow us on

ఎన్నికల ముందు ఏవేవో హామీలిస్తే అధికార పార్టీలో చేరారు. ఎన్నికల తర్వాత ఏం చేయాలో తోచక సైలెంట్ గా వుంటున్నారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నిక వరకు ఎంతో మంది సీనియర్ లు, జూనియర్ లు గులాబీ కండువా కప్పుకున్నారు. ఇప్పడు వాళ్లంతా ఏం చేస్తున్నారు.. ఏదైనా ఎన్నిక వచ్చిందంటే జంపు జిలానీలకు ఫుల్ గిరాకీ వస్తుంది. ఉప ఎన్నిక వచ్చిందంటే ఇంకా డిమాండ్ మామూలుగా వుండదు. ఈ మధ్య రాష్ట్రం లో జరిగిన ఉప ఎన్నికల ముందు అదే జరిగింది. ఎట్లా అయినా గెలవాలని భావించిన అధికార పార్టీ .. విపక్షపార్టీ ల్లో నేతలకు గాలెం వేసింది. సరిగ్గా ఎన్నికల ముందు విపక్ష పార్టీ లకు దెబ్బ కొట్టేందుకు ఏవేవో హామీలిచ్చి పార్టీలో చేర్చుకుంది బీఆర్‌ఎస్‌. ఎన్నిక ముగిసిన తర్వాత ఆ నేతలకు ఏ పదవులు రాక సీఎం కేసీఆర్, అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు.

గత పార్లమెంటు ఎన్నికల ముందు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును సీఎం కేసీఆర్ తన ఇంటికి వెళ్లి మరి పార్టీ లోకి ఆహ్వానించారు. నిజామాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేసిన తన కూతురు కవితను ఎలాగైనా గెలిపించుకోవాలని మండవ వెంకటేశ్వర్లు కు గులాబీ కండువ కప్పారు. మండవ వెంకటేశ్వర్లు సీఎం కేసీఆర్ కు దగ్గర దోస్తు కూడా. ఆయనకు ఇచ్చి తన క్యాబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. దుబ్బాక , హుజురాబాద్ మునుగోడు ఉప ఎన్నికల ముందు చాలామందిని బిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అందులో ఒకరిద్దరికి మాత్రమే పదవులు దక్కాయి మిగతా నేతలు అంతా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు అవకాశం వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ను కలిసి తమకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు.

దుబ్బాక ఓపెనింగ్ ముందు బిజెపి నుంచి రావుల శ్రీధర్ రెడ్డిని చేర్చుకున్నారు. ఆయనకు కార్పొరేషన్ పదవి ఇచ్చారు. హుజురాబాద్ ఉపనికముందు చేసుకున్న నేతలకు ఇప్పటికీ పది భాగ్యం కలగలేదు. సొంత పార్టీలకు కరెక్ట్ టైం లో దెబ్బ కొట్టి అధికారి పార్టీలో చేరి ఏడాదిన్నర కావస్తున్న నేతలు ఖాళీగానే వున్నారు.హుజురాబాద్ ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఇంకో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బిజెపికి దెబ్బ కొట్టి చేరారు. బిజెపిని దెబ్బ కొట్టేందుకు సీఎం కేసీఆర్ నేతల పార్టీ మారడాలను అస్త్రాలుగా చేసుకున్నారు. సొంత పార్టీపైనే నేతలు విమర్శలు గుప్పించారు హుజురాబాద్లో ప్రచారం చేశారు. అక్కడ ఓడిపోవడంతో ఆ నేతలకు ఏ పదవి దక్కలేదు. మోత్కుపల్లి పెద్దిరెడ్డిలు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న టైంలో సీఎం కేసీఆర్ ను కలిదెందుకు వచ్చి గంటల తరబడి లో వేచి చూశారు. చివరి నిమిషంలో ఒక నిమిషం సీఎం కేసీఆర్ కు కనపడేందుకు తహ తహ లాడారు. తమ భాద అంతమందిలో చెప్పుకోలేక నమస్తే పెట్టి బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి

మొన్నటి మునుగోడు ఉపనికముందు చాలామంది నేతలు అధికార పార్టీలో చేరారు దాసోజు శ్రవణ్ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ పల్లె రవి గౌడ్ అండ్ నేతలంతా అధికార ప్రతి తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో ఒకరిద్దరికి ఎమ్మెల్సీ పదవులు మిగతా వారికి కార్పొరేషన్ పదవులు ఇస్తామని హామీతో పార్టీ మారినట్లు ప్రచారం జరిగింది. వారిలో పల్లె రవికి పదవి రాగా మిగితా నేతలు పదవులు రాకపోతాయా అని ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ దర్శనం కోసం అవకాశం కోసం చూస్తున్నారు. అవతల పార్టీ పై దుమ్మెత్తి పోసి టిఆర్ఎస్ లో చేరినందుకు వారికి వేరే అవకాశం కూడా లేదు. దీంతో తమ లైన్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఎలక్షన్స్ ముందు ఎదో ఆశపడి వస్తే ఎన్నికలు ముగిసిన తర్వాత తమ పరిస్థితి కుడితి లో పడ్డ ఎలుకలా తయారయిందని అధికార పార్టీలో చర్చ జరుగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..