
Korutla Assembly Election Result 2023 Live Counting Updates: కోరుట్లలో వారసుల కొట్లాట కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జూనియర్ జువ్వాడి నర్సింగ్‌రావు మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమరానికి సై అంటున్నారు. మొత్తానికి మూడు ప్రధాన పార్టీల నుంచి యువ నేతలు పోటీ చేస్తుండటంతో కోరుట్ల రాజకీయం మంచి రసవత్తరంగా మారింది.
కోరుట్ల ఆసెంబ్లీ పరిధిలో ఎక్కువగా గ్రామీణ ఓటర్లు ఉన్నారు .. ఈ నియోజకవర్గం.. టీఆర్ఎస్ కు కంచుకోట.. అయితే, ఇక్కడ కూడా గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోరుట్లలో ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ గెలుపు ధీమాతో ఉన్నారు. నియోజకవర్గాల పునర్ భజన తరువాత.. 2009లో కోరుట్లు నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో వరుసుగా. టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్) అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగరరావు విజయం సాధిస్తున్నారు. అయితే.. ఈసారి విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్ సంజయ్ కుమార్ బరిలో ఉన్నారు. ఒక్కసారి.. ఓటరు మదిలో ఏముందో.. బయటకు చెప్పడం లేదు. మూడు పార్టీలు మాత్రం, గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తూ.. ప్రచార పర్వంలో ముందుకెళ్తున్నాయి..
ఆయన 2009 నుంచి ఒక ఉప ఎన్నికతో సహా నాలుగుసార్లు గెలిచారు. 2018 ఎన్నికలలో ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది జె.నర్సింగరావుపై 31220 ఓట్ల మెజార్టీతో విసయం సాదించారు. విద్యాసాగరరావుకు 84605 ఓట్లు రాగా, నరసింగరావుకు 53385ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది డాక్టర్ వెంకట్‌కు పదిహేనువేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆయన మూడోస్థానానికి పరిమితం అయ్యారు. విద్యాసాగరరావు వెలమ సామాజికవర్గానికి చెందిన వారు.
కోరుట్ల, అంతకుముందు ఉన్న బుగ్గారం నియోజకవర్గాలలో కలిపి వెలమ సామాజికవర్గం నేతలు ఏడుసార్లు విజయం సాధిస్తే, రెడ్లు నాలుగు సార్లు, బిసిలు రెండుసార్లు, ఇతరులు రెండుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి రత్నాకరరావు బుగ్గారం నుంచి ఒకసారి ఇండిపెండెంటుగా, రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందారు. బుగ్గారం నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఐదుసార్లు, టిడిపి రెండుసార్లు, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్లు గెలుపొందడం మరో ప్రత్యేకత.
కోరుట్ల నియోజకవర్గంలో రెండు మునిసిపాలిటీలతో పాటు నాలుగు మండలాలు. ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో రెండు లక్షల 23 వేయిల 867 ఓట్లు ఉన్నాయి. పురుషులు… లక్ష 7. వేయిల 371 ఓట్లు.. మహిళలు.. లక్షా 16 వేయిల 536 ఓట్లు ఉన్నాయి. పద్మశాలి 28 వేలు… ముస్లిమ్లు… 28,500, మున్నురుకావు- 16203, ఎస్పీలు 24 వేయిలు, గీత కార్మికులు 11 వేయిలు, రెడ్డిలు.. ఆరు వేయిలు… వైశ్య 8 వేయిల పైగా ఓటర్లు ఉన్నారు.. ఇక్కడ పద్మశాలి, ముస్లిమ్.. గెలుపు ఓటములు ప్రభావం చేయమన్నారు.. పద్మశాలీల ఎక్కువగా వ్యాపారాలు. నిర్వహించుకుంటున్నారు. కోరుట్ల, మెట్పల్లిలో అధికంగా ముస్లిమ్లు ఉన్నారు.. గ్రామణ ప్రాంతాల్లో మున్నురు కాపులు, గీత కార్మికులు, రెడ్డిలు అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో.. బిసి లు… బిఆర్ఎస్ కి మొగ్గు చూపారు. 2018 ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి విద్యాసాగర్ రావు కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావుపై 20 వేయిల కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అదే మైనారిటీలలు కూడా బిఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు. ఇక్కడ మైనారిటీలు అధికంగా ఉండటంతో.. హిందూత్వ కార్డును ఉపయోగిస్తుంది. బిజెపి.. కులాలు కాకుండా హిందూత్వ ఓట్లపై గురి పెట్టింది.. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెసకు మైనారిటీలు దూరమవుతున్నారు. ఈపారి… మాత్రం, మైనారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకునే ఆలోచనలో ఉంది కాంగ్రెస్.. గత ఎన్నికల్లో.. రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది.. త్రిముఖ పోరు ఉంటే.. తమకు అనుకూలమైన రిజల్ట్ ఉంటుందని కాంగ్రెస్ ఖాస్తుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్