Konda Surekha: మాజీ మంత్రి సురేఖకు తీవ్ర గాయాలు.. కన్నీటి పర్యంతమైన కొండా మురళి.. వీడియో..
Konda Surekha - Murali: మాజీ మంత్రి కొండా సురేఖ రాహుల్ గాంధీ పర్యటనలో తీవ్ర గాయాలపాలయ్యారు. పెద్ద ప్రమాదం తప్పి ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. బుధవారం రాత్రి ములుగు నుండి భూపాలపల్లికి చేరుకున్న రాహుల్ గాంధీ భూపాలపల్లి సమీపంలోని జెన్కో గెస్ట్ హౌస్ లో బస చేశారు.
Konda Surekha – Murali: మాజీ మంత్రి కొండా సురేఖ రాహుల్ గాంధీ పర్యటనలో తీవ్ర గాయాలపాలయ్యారు. పెద్ద ప్రమాదం తప్పి ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. బుధవారం రాత్రి ములుగు నుండి భూపాలపల్లికి చేరుకున్న రాహుల్ గాంధీ భూపాలపల్లి సమీపంలోని జెన్కో గెస్ట్ హౌస్ లో బస చేశారు. గురువారం ఉదయం అక్కడి నుండే భారీ బైక్ ర్యాలీ ద్వారా భూపాలపల్లి మీదుగా కాటారంకు బయలుదేరారు. ఈ ర్యాలీలో సాధారణ కార్యకర్తలతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. అయితే కుండా సురేఖ కూడా ఓ స్కూటీ నడుపుతూ రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
భూపాలపల్లి నుండి స్కూటీ నడుపుతూ బైక్ ర్యాలీలో పాల్గొన్న కొండా సురేఖ.. మేడిపల్లి సమీపంలోకి చేరుకోగానే ప్రమాదానికి గురయ్యారు.. స్కూటీ అదుపుతప్పి కింద పడడంతో కొండా సురేఖ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో తలకు, మొఖానికి.. రెండు చేతులకు, కాలికి గాయాలయ్యాయి.. అమే అంగరక్షకులు, తోటి కార్యకర్తలు గమనించి ఓ వాహనంలో సురేఖ ను ఆస్పత్రికి తరలించారు.. ప్రాథమిక చికిత్స అనంతరం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసపత్రికి తరలించారు.
అయితే, ఎన్నికల కు సర్వం సిద్దమవుతున్న వేల కొండా సురేఖ ఇలాంటి ప్రమాదానికి గురి కావడం కొండా దంపతులకు తీవ్రనష్టం గా బావిస్తున్నారు… తన సతీమణి గాయాలతో చికిత్స పొందుతుండడం చూసి భర్త మాజీ MLC కొండా మురళి తీవ్ర భావోద్వగానికి లోనయ్యారు. కొండా సురేఖ అభిమానులు, అనుచరులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందళన చెందుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




