కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చోటుచేసుకున్న ఐపీఎస్ బదిలీల్లో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో లూప్ లైన్ లో ఉన్న అధికారులందరికీ కీలక పదవులు అప్పచెప్పారు.. ఇందుకు ఉదాహరణ తాజా బదిలీలే.. ఇప్పటివరకు వచ్చిన ఐపీఎస్ బదిలీల లిస్టు చూస్తే కాంగ్రెస్ మార్క్ స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి దఫా బదిలీలలో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లకు కమిషనర్లను బదిలీ చేశారు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబులను నియమించారు. అయితే ఈ ముగ్గురు అధికారులు కూడా గత ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యత లేని పోస్టింగులు నిర్వహించినవారే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే ఈ ముగ్గురు అధికారులను మూడు కమిషనరేట్లకు కమిషనర్లుగా నియమించారు. ఇక గత ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్లో వ్యవహరించిన అధికారులు అందరికీ రెండోదఫా ఐపీఎస్ బదిలీలలో గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసి ఇంటి ముఖం పట్టారు. ఇక గత ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని పరిస్థితులలో పని చేసిన అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీలు చేసింది. సీఐడీ చీఫ్ గా ఉన్న మహేష్ భగవత్ కు రైల్వే డీజీ పదవి కట్టబెట్టింది. ఇక దాదాపు కొన్ని సంవత్సరాలపాటు ఉమెన్ సేఫ్టీ వింగ్ పరిమితమైన డీఐజీ సుమతినీ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పజెప్పింది. ఎస్ఐబీ చీఫ్ గా సుమతీని బదిలీ చేశారు.. గతంలో ఇదే పదవిలో ఉన్న ఐజీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాల ఫోన్లు టాప్ చేశారని పదే పదే రేవంత్ ఆరోపణలు చేశారు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావ్ రాజీనామా చేశారు..
తెలంగాణ కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత మొదటిసారి 20 మంది ఐపీఎస్ బదిలీలు చోటుచేసుకున్నాయి. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ స్థాయిలో పోలీసు బదిలీలు జరగడం ఇదే మొదటి సారి.. మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు… వీరిలో డీజీ క్యాడర్ ను మొదలుకుని ఎస్పీ స్థాయి అధికారుల వరకు బదిలీలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ప్రస్తుత ఇంచార్జ్ డిజిపి రవి గుప్తాను నియమించింది.. మాజీ డీజీపీ అంజనీ కుమార్ ను రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా నియమించింది. దీంతోపాటు ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్ గాను అంజని కుమార్‌ని బదిలీ చేశారు. సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ ను విజిలెన్స్ డిజీగా నియమించారు. హైదరాబాద్ మాజీ కమిషనర్ సీవీ ఆనంద్ ను ఏసీబీ డిజీగా నియమించారు. రాష్ట్ర డీజీపీ విషయంలో రవి గుప్తా పాటు సీవీ ఆనంద్ పేరు ప్రధానంగా వినిపించింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆనంద్ పేరు డీజీపీగా వస్తుందని అందరూ భావించారు కానీ సీఎం రేవంత్ మాత్రం రవిగుప్తనే కంటిన్యూ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. అంజనీ కుమార్ కి అనుకున్నట్టుగానే ఆయనను ఆప్రాధాన్యత ఉన్న పోస్టుకే బదిలీ చేశారు. ఇక గత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రని హోంగార్డ్స్ ఐజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మరో వైపు పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అడిషనల్ డీజీ అభిలాష బిస్త్ ను నియమించారు.. జైళ్ల శాఖ డీజీ గా అడిషనల్ డీజి సౌమ్యా మిష్ట్రా ను నియమించారు.. సిఐడి అడిషనల్ డీజీపీ తో పాటు సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్గా. శికా గోయల్ ను నియమించారు . అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ను రైల్వే ఆదనపు డీజి గా నియమించారు.. రాచకొండ ఎడిషనల్ సిపిగా తరుణ్ జోషి, ఎక్సిజ్ శాఖ అడిషనల్ డైరెక్టర్గా కమలహాసన్ రెడ్డి ని నియమించారు .
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చోటు చేసుకున్న బదిలీలలో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్లకే కీలక బాధ్యతలు కట్టబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు మొత్తం తమకు అనుకూలంగా ఉన్న అధికారులనే నియమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ లోని అన్ని జోన్ లకు డీసీపీ లుగా డైరెక్ట్ ఐపీఎస్లను నియమించారు. హైదరాబాదులోని విఐపీ జోన్ అయిన వెస్ట్ జోన్ కు ఐపీఎస్ విజయ్ కుమార్ ను నియమించారు. గతంలో సైబరాబాద్ ట్రాఫిక్ ఇంఛార్జి గా విజయ్ కుమార్ పనిచేశారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు విజయకుమార్ను గత ప్రభుత్వం లూప్ లైన్ లో ఉంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే విజయ్ కుమార్ ను హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ చేసింది. ఇప్పటివరకు బదిలీ అయిన 40 మందికి పైగా ఐపీఎస్ లలో కాంగ్రెస్ ప్రభుత్వం సిన్సియారిటీకే ఎక్కువ మొగ్గు చూపింది. ఇక జిల్లా ఎస్పీలు , కమిషనర్లకు సంబంధించిన బదిలీలు సైతం రెండు మూడు రోజుల్లో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
పోలీస్ శాఖలో తాజా బదిలీలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టింగ్ చేసిన అధికారులకు ఈ బదిలీల్లో గట్టి షాక్ తగిలింది. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనిల్ కుమార్ కు తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజి గా నియమించారు.. ఇక గత ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక పదవిలో ఉన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసారు .. ఎలక్షన్ కమిషన్ బదిలీలలో భాగంగా ఆయనను హైదరాబాద్ సీపీ పదవి నుండి తప్పించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో సివి ఆనంద్ కు సిన్సియర్ ఆఫీసర్ గా పేరు ఉండింది. కాంగ్రెస్ ప్రభుత్వం సివి ఆనంద్‌ను అవినీతి నిరోధక శాఖ డీజీగా నియమించింది.. బిఆర్ఎస్ పాలన లో జరిగిన అవినీతి అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేసేందుకే సీవీ ఆనంద్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో నార్కోటిక్ బ్యూరో కు సైతం సీవీ ఆనంద్ డైరెక్టర్ గా వ్యవహరించారు. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు కాగానే సివి ఆనందును నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ నుండి తప్పించి ఏసీబీ డిజీగా నియమించారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అనేక అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక శాఖ డీజీగా సీవీ ఆనంద్ ను నియమించినట్టు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..