Smita Sabharwal: ప్రముఖ ఐఏఎస్‌ ఆఫీసర్‌ స్మితా సభర్వాల్‌ ఇంటర్‌ మార్కులెన్నో తెలుసా?

|

Feb 09, 2024 | 10:00 PM

స్మితా సభర్వాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతి శయోక్తి కాదు . గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారీ ఐఏఎస్‌ ఆఫీసర్‌. సీఎం ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటి పారుదల శాఖ బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన స్మిత సభరాల్వ్‌ కేసీఆర్‌ మెప్పు పొందారు

Smita Sabharwal: ప్రముఖ ఐఏఎస్‌ ఆఫీసర్‌ స్మితా సభర్వాల్‌ ఇంటర్‌ మార్కులెన్నో తెలుసా?
Smita Sabharwal
Follow us on

స్మితా సభర్వాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతి శయోక్తి కాదు . గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారీ ఐఏఎస్‌ ఆఫీసర్‌. సీఎం ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటి పారుదల శాఖ బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన స్మిత సభరాల్వ్‌ కేసీఆర్‌ మెప్పు పొందారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన మొదట్లో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ జరగలేదు. ప్రస్తుతం తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారామె. ఈ సంగతి పక్కన పెడితే సోషల్‌ మీడియాలోనూ ఎంతో చురుకుగా ఉంటారు స్మిత. తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌ కు సంబంధించిన ఫొటోలు, అలాగే వెకేషన్‌, హాలీడే ట్రిప్ ఫొటోలను తరచూ అభిమానులతో షేర్‌ చేస్తుంటాడు. అలా తాజాగా స్మిత షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ప్రస్తుతం అందరి నోటా వినిపిస్తోన్న 12 th ఫెయిల్‌ సినిమా ఒక ప్రేరణ అయితే తనకు 12వ తరగతి ఒక మధురమైన జ్ఞాపకమని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన ఇంటర్మీడియెట్‌ మార్కుల జాబితాను ట్విట్టర్‌ లో షేర్‌ చేశారామె. ‘నా 12వ తరగతి ఫలితాలు నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. పెద్ద పెద్ద కలలను, లక్ష్యాలను కనేలా ప్రేరేపించాయి. జాతీయ స్థాయిలో జరిగే అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ ఒకటి. సివిల్స్‌ కోసం సన్నద్ధమవుతున్న వారికి కష్టపడేతత్వం, స్మార్ట్‌ వర్క్‌ చాలా అవసరం ‘ అని స్మితా సభర్వాల్‌ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు 461 మార్కులు వచ్చిన మెమోను జత చేశారామె.

కాగా ఈ మెమోలో స్మితా సభర్వాల్ విద్యాభ్యాసం వివరాలను కూడా చూడొచ్చు. ఆమె సికింద్రాబాద్ లోని సెయింట్ ఆన్స్ కళశాలలో 12వ తరగతి చదివారు. ఇక అన్ని సబ్జెక్టుల్లోనూ 90 శాతానికి తక్కువ కాకుండా మార్కులు సాధించారామె.

ఇవి కూడా చదవండి

స్మితా సభర్వాల్ ఇంటర్ మార్కుల మెమో ఇదిగో..

స్మిత సభర్వాల్ లేటెస్ట్ పోస్ట్..